Bellamkonda Srinu: బెల్లంకొండ శ్రీనివాస్ కు నోటీసులు .. కారు సీజ్
ABN , Publish Date - May 16 , 2025 | 01:54 PM
ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడంతో పాటు విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించిన సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యారు.
ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడంతో పాటు విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించిన సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ప్రశాసన్‌నగర్‌లో నివసిస్తున్న ఆయన మూడు రోజుల క్రితం కారులో ఫిలింనగర్ (Car బయలుదేరాడు. జర్నలిస్టు కాలనీ సిగ్నల్ వద్ద రాంగ్‌రూట్‌లో వెళ్లాడు. కానిస్టేబుల్ నరేష్ గమనించి అడ్డుకోగా శ్రీనివాస్ అతడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు బెల్లంకొండ పై కేసు నమోదు చేశారు. గురువారం విచారణకు హాజరైన శ్రీనుకు పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు. కారును సీజ్ చేశారు. (Bellamkonda srinu car seized)
ALSO READ: Bellamkonda Srinu: హీరోలు అయితే ట్రాఫిక్ నిబంధనలు పాటించరా..