Kingdom vs Bhairavam: కింగ్డమ్‌ను ఢీ కొంటున్న భైరవం
ABN , Publish Date - May 09 , 2025 | 07:50 PM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం భైరవం రిలీజ్ డేట్‌ను శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohith) ప్రధాన పాత్రల్లో తమిళ చిత్రం సూరి నటించిన గరుడ చిత్రానికి రీమేక్‌గా వస్తోన్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం భైరవం (Bhiravam). ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, యాక్షన్ టీజర్, రెండు పాటలతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాంది ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకే రాధామోహన్ నిర్మించగా పెన్ స్టూడియోస్ డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు.
తాజాగా ఈసినిమా మేకర్స్ ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. మే నెల 30న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురూ కలర్ఫుల్ ఫెస్టివల్ వైబ్‌తో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. ఈ చిత్రంలో ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై కథానాయికలుగా నటించారు. ఇక సినిమా విడుదలకు మూవీ విడుదలకు మూడు వారాలు సమయం మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత దూకుడు పెంచబోతున్నారు.
ఇదిలాఉండగా అదే రోజు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కింగ్డమ్ (KINGDOM), రాజేంద్ర ప్రసాద్, జాకీ చాన్ కరాటే కిడ్ సినిమాల రిలీజ్‌లు ఉండడం విశేషం. అయితే ప్రస్తుత యుద్ద వాతావరణం నేపథ్యంలో కింగ్డమ్ వాయిదా పడనుందని అందుకే సడన్‌గా ఇప్పుడు భైరవం రిలీజ్‌కు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండు మూడు రోజులైతే గానీ ఈ రిలీజ్‌ల విషయంలో క్లారిటీ రానుంది. ఇదిలాఉంటే విజయ్ దేవరకొండ సినిమాకు సోలో రిలీజ్ పడింది.. ఈసారి కలెక్షన్ల సునామీ గ్యారంటీ అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఉన్నఫలంగా భైరవం సినిమా రావడంతో విజయ్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.