Kishkindhapuri: దుల్కర్ తో బెల్లంకొండ.. పోటీ అవసరమా చెప్పమ్మా

ABN , Publish Date - Aug 09 , 2025 | 08:48 PM

కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ఎప్పటినుంచో ఒక మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

Kaantha

Kishkindhapuri: కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ఎప్పటినుంచో ఒక మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. దానికోసం ఈ కుర్రాడు పడని కష్టం లేదు. కానీ, ప్రేక్షకులు మాత్రం బెల్లంబాబును కనీసం పట్టించుకోవడం లేదు. ఈ మధ్యనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. శ్రీనివాస్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. విజయాలు దక్కకపోయినా బెల్లంబాబును అవకాశాలు అందుతూనే వస్తున్నాయి.


తాజాగా సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో కిష్కింధపురి ఒకటి. కౌశిక్ పెగలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాక్షసుడు సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక కిష్కింధపురి నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నిన్నటికి నిన్న ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా కిష్కింధపురి రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


కిష్కింధపురి ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 12 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలుపుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే అదే రోజు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కాంత కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రానా దగ్గుబాటితో పాటు దుల్కర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ నటిస్తోంది. 1950లో జరిగిన ఒక సినిమా కథగా కాంత తెరకెక్కుతుంది.


ఒక హీరో, డైరెక్టర్ కు మధ్య ఉన్న ఈగో వారి జీవితాలను ఎలా మార్చింది అనేది కథగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాంటి సినిమాతో బెల్లంకొండ పోటీకి దిగి రిస్క్ చేస్తున్నాడా.. ? అని అంటే నిజమే అని అంటున్నారు నెటిజన్స్. మరి కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో బెల్లంకొండ.. దుల్కర్ తో పోటీకి దిగుతాడా.. ? లేక మధ్యలో ఆగుతాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Aug 09 , 2025 | 08:48 PM