Sp Balu: రవీంద్ర భారతిలో.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

ABN , Publish Date - Dec 15 , 2025 | 10:28 PM

హైదరాబాద్, రవీంద్ర భారతి ఆవరణలో గాన గంధర్వుడు ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Sp Balu

హైదరాబాద్, రవీంద్ర భారతి ఆవరణలో గాన గంధర్వుడు ఎస్పీ బాలు (Sp Balu) విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమంలో పాల్గొన్న ఎస్.పి చరణ్  మాట్లాడారు. 'తెలంగాణ ప్రభుత్వం, తెలుగు ప్రజలు, బాలు విగ్రహం ఏర్పాటుకు నాలుగేళ్లుగా కృషి చేసిన బృందానికి కృతజ్ఞతలు. నాన్న రాజకీయాలకు అతీతంగా ఉండేవారు. ఆయనకు అందరూ ఒకటే. నాన్న అందరితో ఎంత స్నేహపూర్వకంగా ఉండేవారన్న దానికి ఈ కార్యక్రమం ఓ నిదర్శనం' అన్నారు. 

Sp Balu

ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు తదితరులు   హాజరయ్యారు.బాల సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అతిథులను శాలువాతో సత్కరించారు. 

Updated Date - Dec 15 , 2025 | 10:48 PM