Balakrishna-Thaman: హిట్ కాంబో ఇప్పట్లో వదిలేలా లేదే..!
ABN , Publish Date - Jun 09 , 2025 | 07:26 PM
వరుసగా ఓ టాప్ స్టార్ సక్సెస్ జర్నీలో పాలు పంచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఇంటిపేరే మారిపోయింది... ఆ హీరో - ఆ మ్యూజిక్ డైరెక్టర్ కాంబోలో ఆరో సినిమా కూడా తోడయింది... ఇంతకూ ఆ టాప్ స్టార్ ఎవరు? ఆయనతో సక్సెస్ సరిగమలు పాడుతున్న మ్యూజిక్ డైరెక్టర్ చేస్తోన్న మ్యాజిక్ ఏంటి.
నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna), మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) కాంబో జనాన్ని భలేగా అలరిస్తోంది... అంతకు ముందు బాలయ్య నటించిన 'డిక్టేటర్'కు థమన్ బాణీలు కట్టినా, 'అఖండ' (Akhanda)అఖండ విజయం తరువాత నుంచే ఆయన పేరు భలేగా మారుమోగుతోంది... ఈ సినిమా కంటే ముందు థమన్ కు పలువురు హీరోలతో భారీ సక్సెస్ లే ఉన్నాయి... అయితే 'అఖండ' ఘనవిజయం తరువాత నుంచీ వరుసగా ఇప్పటి వరకు బాలయ్య నటించిన నాలుగు బంపర్ హిట్స్ కు థమన్ స్వరకల్పన చేశారు... "అఖండ (Akhanda), వీరసింహారెడ్డి (Veera Simha Reddy) , భగవంత్ కేసరి (Bhagavanth Kesari ), డాకూ మహరాజ్ (Daaku Maharaaj)" చిత్రాలు అభిమానులను విశేషంగా మురిపించాయి... వీటిలో కొన్ని చిత్రాలు రజతోత్సవం, మరోటి ద్విశతదినోత్సవం జరుపుకున్నాయి... ప్రస్తుతం 'డాకూ మహరాజ్' కూడా సిల్వర్ జూబ్లీ దిశగా అడుగులు వేస్తోంది... ఈ నేపథ్యంలో బాలయ్య రాబోయే 'అఖండ-2' ((Akhanda 2) కు కూడా థమన్ సరిగమలు పలికిస్తున్నారు... ఆ తరువాత బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తెరకెక్కించబోయే చిత్రానికి సైతం థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం! ఇలా వరుసగా బాలయ్య ఆరు సినిమాలకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం ఫ్యాన్స్ లో చర్చనీయాంశమయింది...
తనకు వరుసగా నాలుగు విజయాలు అందించిన థమన్ కు ఆ మధ్య బాలకృష్ణ 'పోర్ష' కారును గిఫ్ట్ గానూ అందించారు... దాంతో థమన్ ను కొందరు 'నందమూరి థమన్' అని పిలవడమూ గమనార్హం!... ఆ మాటను థమన్ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు... అందుకు నిదర్శనంగా ఆ మధ్య యన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన థమన్ మ్యూజికల్ నైట్ లోనూ 'నందమూరి థమన్' (Nandamuri Thaman)అంటూ అభిమానులు కేకలు వేయడం విశేషం!... తాను తొలిసారి కీ బోర్డ్ ప్లే చేసిన 'భైరవద్వీపం' హీరో బాలకృష్ణ అంటే మొదటి నుంచీ తనకెంతో అభిమానం అంటూ థమన్ ఎప్పటి నుంచో చెబుతున్నారు... అదే తీరున ఇప్పుడు తన ఫేవరెట్ హీరోకు ఫ్యాన్స్ ఆనందించేలా ట్యూన్స్ అందిస్తున్నారు... రాబోయే 'అఖండ-2'కే కాదు, బాలయ్య నటించబోయే గోపీచంద్ మలినేని సినిమాకు కూడా థమన్ స్వరకర్త కావడం విశేషం... తనను మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రకటించగానే థమన్ బాలయ్య, గోపీచంద్ కు విషెస్ చెప్పారు... అందుకు గోపీచంద్ 'లెట్స్ రాక్...' అంటూ సమాధానమివ్వడం ఫ్యాన్స్ లో మరింత ఆనందం పెంచుతోంది...
బాలయ్య వరుస సినిమాలకు పనిచేస్తోన్న థమన్ ఇతర టాప్ హీరోస్ కూ బాణీలు సమకూరుస్తున్నారు... పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) హీరోగా రూపొందుతోన్న 'ఓజీ' (OG)కి కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ సినిమాలో తమిళ స్టార్ శింబుతో ఓ పాటను పాడించారు థమన్... త్వరలోనే ఆ పాట జనం ముందుకు రాబోతోంది... ఇక ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతోన్న 'రాజా సాబ్'(Raja Saab)కు సైతం థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు... ఇవి కాకుండా తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటించిన 'తెలుసు కదా' (Telusu Kada), తమిళంలో 'ఇదయమ్ మురళి' (Idhayam Murali)చిత్రాలకు కూడా థమన్ బాణీలు కడుతున్నారు... ఈ సినిమాలు చేస్తోన్నా, బాలయ్య చిత్రానికి థమన్ సంగీతం అని తెలియగానే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు... అంతలా బాలయ్యతో పెనవేసుకున్న థమన్ బాణీల బంధం రాబోయే చిత్రాల్లోనూ అలరిస్తుందని ఫ్యాన్స్ అభిలాష... రామ్ చరణ్ (Ram Charan) హీరోగా 'పెద్ది' (Peddi) సినిమా నిర్మిస్తోన్న వృద్ధి సినిమాస్ పతాకంపై బాలయ్య - థమన్ - గోపీచంద్ మలినేని కాంబో మూవీ రూపొందనుంది... రాబోయే బాలయ్య- థమన్ సినిమాలు ఏ రేంజ్ లో అభిమానులను అలరిస్తాయో చూద్దాం...