Nandamuri Balakrishna : నందమూరి పద్మజ అంతిమయాత్ర.. పాడె ప‌ట్టిన బాల‌కృష్ణ‌

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:50 AM

ఎన్టీఆర్ కోడ‌లు, పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ (73) మంగళవారం తెల్లవారుజామున  కన్నుమూసిన విష‌యం అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

Nandamuri Balakrishna

దివంగ‌త నందమూరి తారక రామ‌రావు (Nandamuri Taraka Rama Rao) కుటుంబంలో (Nandamuri Family) తీవ్ర‌ విషాదం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.. ఎన్టీఆర్ కోడ‌లు, పెద్ద కుమారుడు జయకృష్ణ (Nandamuri Jayakrishna) సతీమణి పద్మజ (73) (Nandamuri Padmaja) మంగళవారం తెల్లవారుజామున  కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న ఆమె శ్వాస కోశ ఇబ్బందుల‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఆమె క‌డ‌సారి చూపు కోసం కుటుం అంతా త‌ర‌లి వ‌చ్చింది. కాగా పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన చెల్లెలు.

ఇదిలాఉంటే.. ఢిల్లీలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలు నిన్న సాయంత్ర‌మే హైద‌రాబాద్‌కు చేరుకోగా బంధువుల సందర్శ‌నార్థం పార్తీవ దేహాన్ని ఇంటి వ‌ద్దే ఉంచారు. ఆపై బుధ‌వారం ఉద‌యం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో నందమూరి పద్మజ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna), ఇత‌ర కుటుంబ స‌భ్యులు పాడ మోయ‌గా కుమారుడు చైత‌న్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు. శ్రీమతి నందమూరి పద్మజ గారి అంతిమయాత్రలో నందమూరి కుటుంబ సభ్యులు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఘట్టమనేని ఆది శేషగిరి గారు, పలువురు నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 11:56 AM