Tandavam: బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:00 AM
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. సినిమా సెప్టెంబరు 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేయడానికి చిత్ర బృందం కృషి చేస్తోంది. తాజాగా బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ పూర్తిచేశారు.