Akhanda2: 12న అఖండ తాండవం.. అధికారికంగా ప్రకటన
ABN , Publish Date - Dec 09 , 2025 | 10:52 PM
అనుకున్నదే జరిగింది. బాలకృష్ణ అఖండ తాండవం (Akhanda 2) రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
అనుకున్నదే జరిగింది. బాలకృష్ణ అఖండ తాండవం (Akhanda 2) రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 12న థియేటర్లకు వస్తోంది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఎరోస్ సంస్థతో ఉన్న ఫైనాన్స్ ఇష్యూలు ఓ కొలిక్కి రావడంతో పాటు సాయంత్రం మద్రాస్ హై కోర్టు స్టే కూడా తొలగించడంతో సినిమా విడుదలకు ఆటంకాలు తొలగిపోయాయి. గురువారం సాయంత్రం నుంచే ప్రీమియర్స్‌తో సినిమా సందడి చేయనుంది.
ఇక.. ఈ యేడాదిలో చివరి క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ గా 'అఖండ-2-తాండవం' వస్తోందని మొదటి నుంచీ వినిపించింది. డిసెంబర్ 5న రావలసిన 'అఖండ-2' కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ చేయడానికి నిర్మాతలు సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ముందుగా డిసెంబర్ 12న తమ చిత్రాలను విడుదల చేస్తామని ప్రకటించిన వారు అయోమయంలో పడ్డారు. ఆ రోజున దాదాపు 15 చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయి.

వాటిలో "ఈషా, మోగ్లీ" వంటి స్ట్రెయిట్ మూవీస్, "అన్నగారు వస్తారు" లాంటి డబ్బింగ్ సినిమా ఉన్నాయి. మిగిలినవి అంతగా చెప్పుకోదగ్గవి కాకపోయినా, 12వ తేదీన రావడానికి సిద్ధమయ్యాయి. 'అఖండ-2' వంటి క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు అదే డేట్ ను లాక్ చేసుకోవడంతో ఆ పదిహేను చిత్రాల్లో మోగ్లీ, ఈషా వంటి సినిమాలు వాయిదా వేసుకున్నారు.
'అఖండ-2' సినిమా వాస్తవానికి డిసెంబర్ 4వ తేదీ రాత్రి ప్రీమియర్ షోస్ తో మొదలు కావాలి. అయితే ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్స్ వల్ల 'అఖండ-2' అనుకున్న సమయానికి జనం ముందుకు రాలేకపోయింది. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రానికి ఈ మూవీకి భలే బజ్ నెలకొంది. కొన్ని కేంద్రాలలో ప్రీమియర్ షోస్ టిక్కెట్స్ సైతం ఇష్యూ చేశారు. అంత క్రేజ్ వచ్చిన 'అఖండ-2' అనుకున్న సమయానికి ప్రేక్షకులను పలకరించలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ లో మునుపటి ఉత్సాహం కరవయిందని వినిపిస్తోంది.