Bahubali The Epic: బాహుబలి టీజర్ రెడీ.. వచ్చేది ఎప్పుడంటే..
ABN , Publish Date - Aug 12 , 2025 | 08:23 PM
‘బాహుబలి: ది బిగినింగ్’ (Bahubali) , ‘బాహుబలి: ది కంక్లూజన్’.. ఈ రెండు చిత్రాలు సాధించిన విజయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన చిత్రాలివి.
‘బాహుబలి: ది బిగినింగ్’ (Bahubali) , ‘బాహుబలి: ది కంక్లూజన్’.. ఈ రెండు చిత్రాలు సాధించిన విజయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన చిత్రాలివి. బాహుబలి విడుదలై పదేళ్లు గడిచిన సందర్భంగా ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రెండు భాగాలను ఓ సినిమాగా విడుదల చేయనున్నట్లు రాజమౌళి (SS Rajamouli) ప్రకటించారు. దీనికి సంబంధించిన టీజర్ సిద్ధమైంది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాట్ (Globetrotter) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. మరో వైపు ‘బాహుబలి: ది ఎపిక్’ (Bahubali The epic) ఎడిటింగ్ వర్క్స్ సైతం చూస్తున్నారు. ఆ పనులు తుది దశలో ఉన్నాయి. టీజర్ కూడా రెడీ చేశారని తెలిసింది.
హృతిక్ రోషన్, తారక్ హీరోలుగా నటించిన ‘వార్ 2’ ఆగస్టు 14న విడుదల అవుతుంది. అదే రోజున సూపర్‌స్టార్ రజనీకాంత్, కింగ్ అక్కినేని నాగార్జున, బాలీవుడ్ మిస్టర్ మిస్టర్ పెర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన ‘కూలీ’ కూడా రిలీజ్ అవుతోంది. ఆ రెండు సినిమాలతో ‘బాహుబలి: ది ఎపిక్’ టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇక ‘బాహుబలి: ది ఎపిక్’ చిత్రాన్ని అక్టోబర్ 31న థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. అయితే రెండు చిత్రాలను ఒకటిగా చేయడంలో రాజమౌళి ఏయే సన్నివేశాలను కట్ చేస్తారు? ఎంత నిడివితో విడుదల చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికర విషయం. గత ఏడాదిన్నరగా రీ రిలీజ్‌ల ట్రెండ్‌ను చూస్తున్నాం. అయితే రాజమౌళి మరో కొత్త విధానానికి రూట్ వేశారు. రెండు భాగాలను ఒకటిగా చేసే ట్రెండ్ స్టార్ట్ చేశారు.