Bahubali: బాహుబలి టీం సెలెబ్రేషన్స్
ABN , Publish Date - Jul 10 , 2025 | 09:30 PM
ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి ఒక చరిత్ర. 63వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ సినిమాగా బాహుబలి పురస్కారం అందుకుంది.
ఇండియన్ సినిమా హిస్టరీలో 'బాహుబలి' ఒక చరిత్ర. 63వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ సినిమాగా 'బాహుబలి' పురస్కారం అందుకుంది. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు అందుకుంది. నంది అవార్డుల్లో 14 సొంతం చేసుకుంది. పాన్ ఇండియా ట్రెండ్‌కు నాంది పలికింది. పాన్ ఇండియా రిలీజ్ తర్వాత ఇంగ్లీష్, చైనీస్, థాయ్ వంటి విదేశీ భాషల్లోనూ సినిమాను విడుదల చేశారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా పార్ట్ 1 విడుదలై గురువారానికి పదేళ్లు (10 Years of Baahubali).
ఈ సందర్భంగా చిత్ర బృందం వేడుక చేసుకుంది. నటులు ప్రభాస్ (Prabhas), రానా (Rana Daggubati), రమ్యకృష్ణ, నాజర్, దర్శకుడు రాజమౌళి (Rajamouli), సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ తదితరులు పాల్గొన్నారు.
సినిమాలో ఫేమస్ డైలాగ్ ‘ఇది నా మాట.. నా మాటే శాసనం’తో కూడిన ఫ్లకార్డుతో రమ్యకృష్ణ కనిపించారు. సంబంధిత ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.