Bad Girlz: బ్యాడ్ గాళ్స్.. చాలా మంచోళ్ళట

ABN , Publish Date - Dec 13 , 2025 | 04:06 PM

'30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'మూవీని తెరకెక్కించిన ఫణి ప్రదీప్ ధూళిపూడి ఇప్పుడు 'బ్యాడ్ గార్ల్స్' అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ డిసెంబర్ 25న విడుదల కాబోతోంది.

Bad GirlZ movie

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'బ్యాడ్ గాళ్స్'. 'కానీ చాలా మంచోళ్ళు' అనేది దీని ట్యాగ్ లైన్. గతంలో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాను తెరకెక్కించిన ఫణి ప్రదీప్ ధూళిపూడి దీనిని డైరెక్ట్ చేశారు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.


WhatsApp Image 2025-12-13 at 12.02.58.jpeg

'బ్యాడ్ గాళ్స్'మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ 'మా ‘బ్యాడ్ గాళ్స్’ పూర్తి ఎంటర్టైనర్ మూవీ. 'జాతి రత్నాలు, మ్యాడ్' లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా ఇది. మూవీ చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అనూప్ రూబెన్స్ మంచి సంగీతం అందించగా ఆస్కార్ విజేత చంద్ర బోస్ ఇందులోని అన్ని పాటలకు సాహిత్యం అందించారు. పాటలు చాలా బాగా వచ్చాయి. ఇటీవల విడుదల అయినా 'ఇలా చూసుకుంటానే' పాటకు మంచి ఆదరణ లభించింది, యూట్యూబ్ లో 6 మిలియన్ వ్యూస్ తో దుసుకుపోతుంది. అలాగే ఇటీవల విడుదల అయినా టైటిల్ సాంగ్ కి మంచి ఆదరణ లభిస్తోంది. మిగతా పాటలు, టీజర్, ట్రైలర్ ను త్వరలో విడుదల చేస్తాం' అని అన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 08:29 PM