Police Vari Hechcharika: సందేశంతో వినోదం
ABN , Publish Date - Jul 09 , 2025 | 06:22 AM
సందేశం, వినోదం కలబోతగా తెరకెక్కిన చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మించారు. సన్నీ అఖిల్, అజయ్ ఘోష్ ప్రధాన తారాగణం. ఈ నెల 18న...
సందేశం, వినోదం కలబోతగా తెరకెక్కిన చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మించారు. సన్నీ అఖిల్, అజయ్ ఘోష్ ప్రధాన తారాగణం. ఈ నెల 18న విడుదలవుతోంది. ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ‘ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే సందేశాత్మక చిత్రమిది. మానవ సంబంధాల్ని చక్కగా ఆవిష్కరించాం. అలరించే భావోద్వేగాలు, అదరగొట్టే యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో మిళితమై ఉంటాయి’ అని చెప్పారు. బెల్లి జనార్ధన్ మాట్లాడుతూ ‘కుటుంబంతో చూడదగ్గ వినోదాత్మక చిత్రమిది. నవ్వించడంతో పాటు చక్కటి సందేశంతో దర్శకుడు తెరకెక్కించారు. ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు.