Vana Veera: ఇదేక్కడి విడ్డూరం.. వారంలోనే సినిమా పేరు మార్చారు
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:52 AM
అవినాష్ తిరువీధుల (Avinash Thiruveedhula) స్వీయ దర్శకత్వంలో హీరోగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం వనవీర
అవినాష్ తిరువీధుల (Avinash Thiruveedhula) స్వీయ దర్శకత్వంలో హీరోగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం వనవీర (Vana Veera). హీరోయిన్‌గా సిమ్రాన్ చౌదరి (Simran Choudhary), ప్రతినాయకుడిగా నందు (Nandu) నటించారు. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా భారీ చిత్రాల పోటీ వళ్ల వాయిదా పడింది.
ఈ చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ (Vivek Sagar) మ్యూజిక్ అందిస్తున్న ఈ మైథలాజికల్ రూరల్ డ్రామా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
అయితే.. నిన్న, మొన్నటి వరకు 'వానర' అనే పేరుతో ఈ సినిమాను పబ్లిసిటీ చేసి, టీజర్, పాటలు సైతం రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేసి సినమా టైటిల్‌ను వనవీరగా మార్చి షాకిచ్చారు. ఇక ట్రైలర్ చూస్తే సగటు ప్రేక్షకుడు కోరుకునే అన్ని హంగులను ఏరి కూర్చి మరి మూవీని తీర్చదిద్దినట్లు అర్తమవుతుంది.