James Camerons Avatar: 160 భాషల్లో అవతార్‌ 3

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:02 AM

ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్‌’ ఫ్రాంచైజీకు ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే. హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన ’అవతార్‌’... ప్రపంచ సినీ చరిత్రలో సంచలనం...

ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్‌’ ఫ్రాంచైజీకు ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే. హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన ’అవతార్‌’... ప్రపంచ సినీ చరిత్రలో సంచలనం సృష్టించింది. ఈ సిరీ్‌సలో ఇప్పటి వరకూ రెండు భాగాలు విడుదలై ఘన విజయం సాధించాయి. తాజాగా మూడో భాగం ‘అవతార్‌ - ఫైర్‌ అండ్‌ యాష్‌’ నుంచి వరంగ్‌ పాత్ర ఫస్ట్‌లుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈనెల 25న ట్రైలర్‌ని రిలీజ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2025 డిసెంబరు 19న ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో ‘అవతార్‌-3’ విడుదల కానుంది. కాగా, ‘అవతార్‌-4’ 2029లో, ‘అవతార్‌ -5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.

Updated Date - Jul 23 , 2025 | 03:02 AM