PawanKalyan: 'హరి హర వీరమల్లు'.. అసుర హ‌న‌నం సాంగ్ రిలీజ్‌

ABN, Publish Date - May 21 , 2025 | 12:42 PM

పవన్ కళ్యాణ్ న‌టించిన‌ భారీ పాన్ ఇండియా మూవీస్ 'హరి హర వీరమల్లు' విడుద‌ల వైపు శ‌ర వేగంగా అడుగు వేస్తోంది.

hari hara

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) న‌టించిన‌ భారీ పాన్ ఇండియా మూవీస్ 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) విడుద‌ల వైపు శ‌ర వేగంగా అడుగు వేస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని పవర్ స్టార్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాపై నుంచి రిలీజ్ ప్రచార చిత్రాలు, గీతాలు మూవీపై అంచనాలు అంబరాన్ని అంటేలా చేశాయి.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి అసుర హన‌నం అంటూ సాగే మ‌రో పాటను మేకర్స్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుదల చేశారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన పాట‌కు అస్కార్ విన్న‌ర్ కీర‌వాణి సంగీతం అందించ‌గా ఐరా ఉడిపి, కాల భైరవ, సాయి చరణ్ భాస్కరుణి, లోకేశ్వర్ ఈదర, హైమత్ మహమ్మద్ ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట విడుద‌ల చేసిన నిమిషాల్లోనే అన్ని ఫ్లాట్ ఫాంల‌లో ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది.

Updated Date - May 21 , 2025 | 12:43 PM