Mahavatar Narsimha: మన చరిత్ర చెప్పాలనే ప్రయత్నం
ABN , Publish Date - Jul 21 , 2025 | 05:24 AM
పురాణాల్లోని దశావతారాల ఆధారంగా తెరకెక్కుతోన్న ‘మహావతార్’ సినిమాటిక్ యూనివర్స్‌లో వస్తున్న తొలి యానిమేషన్ త్రీడీ చిత్రం ‘మహావతార్ నరసింహ’. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో...
పురాణాల్లోని దశావతారాల ఆధారంగా తెరకెక్కుతోన్న ‘మహావతార్’ సినిమాటిక్ యూనివర్స్‌లో వస్తున్న తొలి యానిమేషన్ త్రీడీ చిత్రం ‘మహావతార్ నరసింహ’. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ నిర్మించారు. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అశ్విన్‌కుమార్ మీడియాతో ముచ్చటించారు.
నరసింహ స్వామి అవతారం కేవలం ఒకపురాణ గాథ కాదు. మన చరిత్ర. దాని గురించి ప్రతి తరానికీ చెప్పాల్సిన అవసరం ఉంది. నేటి బాలలకు మన సంస్కృతి గురించి అవగాహన కలిగించేలా ఈ సినిమా ఉంటుంది. ఇప్పటివరకూ చూడని విజువల్స్‌ను బిగ్‌స్ర్కీన్ మీద చూడబోతున్నారు. వార్ సీక్వెన్స్‌లు చాలా అద్భుతంగా ఉంటాయి. సరికొత్త అనుభూతిని పంచుతాయి.
భారీ బడ్జెట్‌తో మంచి నిర్మాణ విలువలతో తీసిన సినిమా ఇది. చరిత్ర, సంస్కృతి, ధార్మిక అంశాల మేళవింపుగా తెరకెక్కించాం. గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేయడం ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తుంది.
శ్రీ మహావిష్ణువు దశావతారాలను బిగ్ కాన్వా్‌సలో చూపించాలనే ఆలోచనతో మహావతార్ యూనివర్స్ మొదలైంది. ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో వస్తున్న తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’. నటీనటుల ఇమేజ్ దేవుడి పాత్రలను డామినేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టే యానిమేషన్‌లో అయితేనే ఇలాంటి కథకు న్యాయం చేయగలం అని భావించాం.