Ashok Galla: మహేష్ బాబు మేనల్లుడైనా.. పవన్ కు వీరాభిమానే..

ABN , Publish Date - Sep 24 , 2025 | 08:56 PM

ఇండస్ట్రీలో అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ, హీరోలనే ఫ్యాన్స్ గా చేసుకున్న హీరోల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకరు.

Ashok Galla

Ashok Galla: ఇండస్ట్రీలో అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ, హీరోలనే ఫ్యాన్స్ గా చేసుకున్న హీరోల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకరు. తమిళ్ లో రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే కంపెనీలకు సెలవులు ప్రకటిస్తారు. ఇక ఇప్పుడు ఆ ఘనత పవన్ కూడా అందుకున్నాడు. ఓజీ రిలీజ్ అవుతుందని ఒక కంపెనీ రేపు సెలవు ప్రకటించిందట. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓజీ మ్యానియా అలా ఉంది. అభిమానులు ఏంటి.. హీరోలు కూడా ఈ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ కు వెళ్లాలని ఊవిళ్లూరుతున్నారు.


ఇండస్ట్రీలో పవన్ కు అందరూ ఫ్యాన్సే. అందులో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా ఒకడు. మరి ఫ్యాన్ అయ్యాక ఓజీ సినిమాను ఎలా మిస్ అవుతారు. అందుకే కచ్చితంగా సినిమాకు వెళ్లాలని కంకణం కట్టుకున్నాడు. కానీ, అదే రోజు షూట్ ఉండడంతో.. ఆ షూట్ ను క్యాన్సిల్ చేయమని డైరెక్టర్ ను ఎలా బతిమాలాడుతున్నాడో ఒక వీడియో తీసి మరీ అభిమానులతో పంచుకున్నాడు. అశోక్ గల్లా ప్రస్తుతం వింటారా సరదాగా అనే సినిమాలో నటిస్తున్నాడు. నటుడు, డైరెక్టర్ అయిన ఉద్భవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. నాగవంశీ నిర్మిస్తున్నాడు.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఓజీ రిలీజ్ రోజు కూడా డైరెక్టర్ షూటింగ్ ఉంది అనడంతో చిత్ర బృందం మొత్తం ఓజీకి వెళ్లాలని, షూటింగ్ క్యాన్సిల్ చేయించడానికి నానా కష్టాలు పడ్డారు. అశోక్ నేను హీరోని.. నేను చెప్తే షూటింగ్ ఆగుతుంది అనిధీమాగా వెళ్లినా పని కాలేదు. దీంతో ఆ తరువాత చాలామంది డైరెక్టర్ ను కన్విన్స్ చేయాలనీ ట్రై చేసి ఓడిపోయారు. మరి చివరకు షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందా లేదా అనేది వీడియోలో చెప్పలేదు. ఇక క్యాప్షన్ లో ఎవరైనా డైరెక్టర్ ను కన్విన్స్ చేసే సలహాలు ఇవ్వమని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి రేపు ఓజీ థియేటర్ లో అశోక్ గల్లా, వీసా టీమ్ కనిపిస్తారో లేదో చూడాలి.

Amrita Rao: రక్తంతో లవ్ లెటర్.. భయపడిన మహేష్ హీరోయిన్

Reba Monica John: కూలీ.. చాలా డిస్సప్పాయింట్ అయ్యాను

Updated Date - Sep 24 , 2025 | 08:56 PM