Ashika Ranganath: నా సామిరంగ రవితేజ సరసన కొట్టేసింది..

ABN , Publish Date - Jun 05 , 2025 | 04:24 PM

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) ‘మాస్‌ జాతర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆగస్టు 27న ఈ చిత్రాన్ని విడుదల  చేస్తున్నారు. ఈలోపు ఆయన కిషోర్‌ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో 'అనార్కలి' (Anarkali)సినిమాని మొదలెట్టే ఆలోచనలో ఉన్నారు.

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) ‘మాస్‌ జాతర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆగస్టు 27న ఈ చిత్రాన్ని విడుదల  చేస్తున్నారు. ఈలోపు ఆయన కిషోర్‌ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో 'అనార్కలి' (Anarkali)సినిమాని మొదలెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈ నెల రెండో వారంలో చిత్రీకరణ మొదలెట్టే అవకాశం ఉందని తెలిసింది. 2026 సంక్రాంతికి విడుదల చేయాలన్నది మేకర్స్‌ ప్లాన్‌. సంక్రాంతి సీజన్‌ మిస్‌ అయితే 2026 వేసవికి విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్‌లకు ఆస్కారం ఉంది. ఓ నాయికగా కేతిక శర్మని ఇప్పటికే ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు రెండో నాయికగా ఆషికా రంగనాథ్‌ని (Ashika Ranganath) తీసుకొన్నారని సినీ వర్గాల నుంచి సమాచారం.

Ranghanath.jpg

‘నా సామిరంగ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ. ‘విశ్వంభర’లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అనార్కలి చిత్రంలో రవితేజ సరసన అవకాశం అందుకొందని టాక్‌. అయితే ఇదే చిత్రానికి ఓ సమయంలో మమితా బైజు, కయాడు లోహార్‌ పేర్లు కూడా వినిపించాయి. అయితే వీళ్లిద్దరి కాల్షీట్లు దొరకడం కష్టమైందని తెలుస్తోంది. జూన్‌లో మొదలెట్టి, నవంబరులో సినిమా పూర్తిచేయాలని నిర్మాతల ప్రణాళిక.  అందుకే ఇతర హీరోయిన్ల వేటలో కాలయాపన చేయకుండా ఆషికాను ఫిక్స్‌ చేశారట. ఇక ఆఫీషియల్‌గా మేకర్స్‌ చెప్పాల్సి ఉంది.

Updated Date - Jun 05 , 2025 | 04:25 PM