Gatha Vaibhavam Trailer : 'గ‌త వైభ‌వం' ట్రైల‌ర్‌.. ఇంత డిఫ‌రెంట్‌గా ఉందేంటి

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:41 PM

ఎస్‌ఎస్‌ దుష్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన క‌న్న‌డ‌ చిత్రం ‘గత వైభవ’. ఈ చిత్రాన్ని గ‌త వైభ‌వం పేరుతో తెలుగులో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Gatha Vaibhavam Trailer

ఎస్‌ఎస్‌ దుష్యంత్ (Dushyanth), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) జంటగా నటించిన క‌న్న‌డ‌ చిత్రం ‘గత వైభవ’. (Gatha Vaibhava). సింపుల్‌ సుని దర్శకత్వం వ‌హించ‌గా దీపక్‌ తిమ్మప్ప నిర్మించారు. ఈ చిత్రాన్ని గ‌త వైభ‌వం పేరుతో తెలుగులో ఈ నెల 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

‘నాలుగు యుగాల నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రేమ, పునర్జన్మ, పురాణ గాథలను స్పృశిస్తూ సాగుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రం తెలుగు హక్కులను నిర్మాతలు కే. నిరంజన్‌ రెడ్డి, చైతన్యరెడ్డి దక్కించుకున్నారు.

అయితే .. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, పాట‌లు మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోగా తాజాగా సోమ‌వారం ఈ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ట్రైల‌ర్‌ను చూస్తుంటే సినిమా చాలా విభిన్న‌మైన కాన్సెప్ట్‌తో తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మవుతోంది. ముఖ్యంగా కొన్ని ప్ర‌ముఖ సినిమాల‌కు స్ఫూప్‌గా మూవీని తీసిన‌ట్లు తెలుస్తుంది. డైలాగ్స్ మాత్రం మ‌రో రేంజ్‌లో ఉన్నాయి.

ట్రైల‌ర్‌లో వ‌చ్చిన ఫ‌స్ట్ డైలాగే ఫుల్ క్రేజీగా ఉంది. ఓడ‌కు బోక్క ప‌డింద‌ని వ‌ర్క‌ర్ చెప్ప‌డం.. ఫెవికాల్‌తో పూడ్చ‌మ‌ని హీరో చెప్ప‌డం ఆ వెంట‌నే వ‌ర్క‌ర్ బాస్ మ‌నం 15 సెంచరీలో ఉన్నాం ఇంకా ఫెవికాల్ క‌నిపెట్ట‌లేదంటూ చెప్పే డైలాగుల‌తో ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఉంది. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Nov 10 , 2025 | 12:47 PM