Arjun Chakravarthy: కబడ్డీ ఆటగాడి కథ

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:37 AM

విజయరామరాజు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సినిమా ‘అర్జున్‌ చక్రవర్తి’. విక్రాంత్‌ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మిస్తున్నారు. సిజ్జా రోజ్‌ కథానాయిక. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని దర్శకుడు హను రాఘవపూడి...

విజయరామరాజు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సినిమా ‘అర్జున్‌ చక్రవర్తి’. విక్రాంత్‌ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మిస్తున్నారు. సిజ్జా రోజ్‌ కథానాయిక. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని దర్శకుడు హను రాఘవపూడి లాంచ్‌ చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి జీవితం ఆధారంగా రూపొందించిన ట్రైలర్‌ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విక్రాంత్‌ రుద్ర మాట్లాడుతూ ‘ఈ సినిమాని అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో 120 లొకేషన్లలో చిత్రీకరించాం’ అని చెప్పారు. విజయరామరాజు మాట్లాడుతూ ‘నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది. మంచి క్యారెక్టర్‌ ఉన్న చిత్రం రావడం చాలా అరుదు. మీరందరూ సపోర్ట్‌ చేసి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 03:37 AM