Ari: ‘అరి’ చివరి.. ఆ 20 నిమిషాలు హైలెట్
ABN , Publish Date - Oct 14 , 2025 | 08:20 PM
Director Jayashankar continues the divine trend with ‘Ari’. Centered on Ari Shadwargas, the film captivates audiences with its profound spiritual message in the final 20 minutes.
ప్రస్తుతం తెలుగు సినీ ప్రపంచంలో “డివైన్ ట్రెండ్” హవా నడుస్తోంది. కార్తికేయ 2, కాంతార, హనుమాన్, మిరాయ్, కాంతార చాప్టర్ 1 వంటి చిత్రాలు మైథలాజికల్ టచ్‌తో ప్రేక్షకులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి. ఈ సినిమాలు అందించిన డివైన్ వైబ్స్ ప్రేక్షకుల మనసుల్లో బలంగా ముద్రవేసి బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి.
ఇప్పుడీ ట్రెండ్‌ను కొనసాగిస్తూ, పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ తన కొత్త చిత్రం ‘అరి’ ద్వారా మరో ప్రత్యేక కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అరి షడ్వర్గాలు అనే డివైన్ కాన్సెప్ట్‌ను పాయింట్‌గా తీసుకుని, ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని ఆలోచనతో సమాజానికి అర్థమయ్యే విధంగా అందించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
గత వారం విడుదలైన ‘అరి’ సినిమా మెయిన్ థీమ్, ఎమోషన్, ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో చెప్పిన సందేశంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కృష్ణుడి ఎంట్రీ, ఆయన ఇచ్చిన ఆధ్యాత్మిక సందేశం సినిమాకే హెలెట్‌గా నిలిచాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ మాటలు ప్రేక్షకుల మనసుల్లో మార్మోగుతున్నాయి.
సోషల్ మీడియాలోనూ పాజిటివ్ టాక్ నడుస్తోంది. విమర్శకులు, మీడియా, సినీ ప్రేమికులు అందరూ కూడా దర్శకుడి ఆలోచనను, ఆయన చూపించిన ప్రెజెంటేషన్ స్టైల్‌ను ప్రశంసిస్తున్నారు. వినోద్ వర్మ, అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, సురభి ప్రభావతి వంటి నటీనటులు తమ పాత్రలతో సినిమాలో ప్రాణం పోశారు.