Anushka Shetty: పవర్ ఫుల్ రోల్స్ కి కేరాఫ్ గా అనుష్క
ABN , Publish Date - Jun 12 , 2025 | 06:08 PM
టాలీవుడ్ ను ఏలేసి... కాస్తంత గ్యాప్ ఇచ్చిన ముద్దుగుమ్మ తిరిగి రేస్ లోకి వచ్చేస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్ మోడ్ లో ఉన్న స్వీటీ పవర్ ఫుల్ రోల్స్ కు కేరాఫ్ గా మారుతోంది.
టాలీవుడ్ ను ఏలేసి... కాస్తంత గ్యాప్ ఇచ్చిన ముద్దుగుమ్మ తిరిగి రేస్ లోకి వచ్చేస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్ మోడ్ లో ఉన్న స్వీటీ పవర్ ఫుల్ రోల్స్ కు కేరాఫ్ గా మారుతోంది. ఇప్పటికే తన మేనియాను కొనసాగించిన బ్యూటీ.... ఇప్పుడు అంతకు మించిన రోల్ చేయబోతుండటం సెన్సేషన్ గా మారింది.
అనుష్క శెట్టి (Anushka Shetty) టాప్ హీరోలతో జోడీ కట్టడమే కాదు.. పవర్ రోల్స్ కు కేరాఫ్ గా మారింది. తనదైన యూనిక్ యాక్టింగ్తో విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. ముఖ్యంగా హీరోలకు దీటుగా ఇమేజ్ సంపాదించుకుని ఆడియెన్స్ ని థియేటర్లకు రప్పించుకోగలుతోంది. తన లాంగ్ కెరీర్లో ఎన్నో మైలు రాళ్ళ వంటి చిత్రాలను చేసిన జేజమ్మ కెరీర్ ఒకానొక దశలో ముగింపుకొచ్చిందనే కామెంట్స్ వినిపించాయి. కట్ చేస్తే అంతకు మించి శక్తివంతమైన పాత్రలు ఆమె తలుపు తడుతున్నాయి. ప్రెజెంట్ అలాంటి రోల్ తో మరోసారి మాయ చేయడానికి రెడీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఒక అరుంధతి పాత్ర (Arundhati) చేయాలన్నా.. దేవసేన క్యారెక్టర్ (Devasena) చేయాలన్నా.. రుద్రమదేవి (Rudrama Devi) గా నటించాలన్నా, భాగమతి (Bhaagamathi) పాత్రలో జీవించాలన్నా... ఒకే ఒక్క హీరోయిన్ వల్ల అవుతోంది. ఆ హీరోయిన్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా... అది వన్ అండ్ ఓన్లీ అనుష్క శెట్టి! రీసెంట్ గా 'ఘాటీ' (Ghaati) తో మరోసారి ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే చాలా సినిమాల్లో పవర్ రోల్స్ లో నటించిన స్వీటీ... ఈ సినిమాలో అంతకు మించి కనిపించబోతుందని గ్లింప్స్ చూస్తే అర్థమైంది. పాడేరు బ్యాక్ డ్రాప్ లో సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో అనుష్క ... వయెలెంట్ గా కనిపించనుంది. బయటకు వచ్చిన ప్రమోషల్ వీడియోలో... బస్ మిర్రర్ లో చూస్తూ కసిగా విలన్ గొంతు కోయడం ... ఆ తర్వాత తలని చేత్తో తీసుకెళ్లి... తాపీగా బంగ్ తాగుతూ రిలాక్స్ అయిన సీన్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాతో మరోసారి హిట్ పక్కా అనుకుంటున్న టైంలో మరో చిత్రంలో సూపర్ రోల్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం... కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) సినిమాటిక్ యూనివర్స్ లోకి అనుష్క ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎల్.యు.సి.లో భాగంగా తెరకెక్కనున్న 'ఖైదీ-2' (Kaithi 2) లో ఛాన్స్ కొట్టేసిందట. ఈ మూవీలో లేడీ డాన్ గా అనుష్క కనిపించబోతుందట. ఈ క్యారెక్టర్ సినిమాకే హైలెట్ గా ఉండనుందని రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో స్వీటీ కనిపించనుందని తెలుస్తోంది. ఇక కరెక్ట్ గా చెప్పాలంటే కార్తీ (Karthi) ప్లే చేసిన ఢిల్లీ రోల్ కు దీటుగా అనుష్క రోల్ ఉంటుందని టాక్. ఇప్పటికే ఈ రోల్ కు దేవసేన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నెవర్ బిఫోర్ అనేలా డిజైన్ చేస్తున్నాడట లోకేష్. ప్రెజెంట్ లోకేష్... రజనీకాంత్ తో తెరకెక్కించిన 'కూలీ' (Coolie) ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల కాగానే 'ఖైదీ 2' పై ఫోకస్ పెడతాడట. నిజంగా లోకేష్ డెన్ లోకి అనుష్క ఎంట్రీ ఇస్తే... ఆమె కెరీర్ కు ఈ మూవీ మరింత ప్లస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.