Kishkindhapuri: అనుపమా.. గట్టిగానే ఫ్లాన్ చేసిందిగా! ‘కిష్కింధపురి’ ట్రైలర్ అదిరింది
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:36 PM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ఫాంటసీ హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ఫాంటసీ హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). కౌశిక్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబయింది. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మేకర్స్ బుధవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. చాలాకాలం తర్వాత తెలుగులో ఇంత పెద్ద స్థాయిలో పేరున్న నటులతో వస్తున్న చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే.. ఇప్పటి వరకు ఈ తరహాలో వచ్చిన అన్ని చిత్రాలకు భిన్నంగా ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఊరికి ఉత్తరాన.. దారికి దక్షిణాన.. పశ్చిమ దిక్కున ఉన్న ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం అంటూ గంభీరమై బ్యాగ్రౌండ్ వాయిస్‌లో ఆరంభించి ట్రైలర్‌పై ఆసక్తి కలిగించారు. ఆపై దయ్యాలంటే ఆసక్తి ఉన్న వారందరినీ టీమ్ లాగా చేసి వారినందరిన ఘోష్ట్ వాకింగ్ టూర్ అంటూ ఓ పాడుపడ్డ ఇంట్టి చుట్టూ తిప్పుతూ దాని వెనక స్టోరీ చెప్పే జంటగా హీరో హీరోయిన్లు అండ్ టీంను పరిచయం చేయడం కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్‌లా ఉంది.
అలా ఘోష్ట్ వాకింగ్‌కు వెళ్లిన వారికి నిజంగా దయ్యాలు ఎదురు పడడం, బ్రతుకు మీద తీపున్న వాళ్ళు బ్రతకడానికి అర్హులే కారు అంటూ అక్కడి వారిని గాయ పరిచి భయభ్రాంతులకు గురి చేయడం చేస్తాయి. ఈ క్రమంలో వారు ఆ ప్రాతం నుంచి బయట పడ్డారా లేదా, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనే థ్రిల్లంగ్ పాయింట్‌తో సినిమా ఉంటుందనేలా ట్రైలర్ కట్ చేశారు. చివర్లో ఓ రూంలో అనుపమా తీవ్రంగా గాయ పడి బాడీ అంతా బ్యాండేజ్‌లతో కనిపించి సడన్‌గా అంతా పోయి ఆమెలోనే దయ్యం ఉన్నట్లు చూయించి షాకిచ్చారు. అంతేకాదు రేడియో ద్వారా మాట్లాడుతూ ఆదేశాలు ఇచ్చే దెయ్యం స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇక విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్ని ఫర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఎక్కడా కూడా కథ బయటకు తెలియకుండా సమ్‌థింగ్ ఏదో ఉందనేలా అద్యంతం హర్రర్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ కట్ చేయడం బావుంది. ఇక రాక్షసుడు తర్వాత తిరిగి జంటగా కలిసి నటిస్తున్న బెల్లంకొండ, అనుపమా పరమేశ్వరన్ జోడీ ఆకర్షణీయంగా ఉంది. అనుపమా పాత్రలో బాగానే వేరియేషన్స్ ఉన్నట్లు తెలుస్తోండగా ఓ అంతం లేని దయ్యంతో బెల్లంకొండ ఎదురు పడే సీన్లు, పలికే డైలాగులు సైతం ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. మొత్తానికూతే ఈ ట్రైలర్ ఇటీవల వచ్చిన చిత్రాలకన్నా మెరుగ్గా, ఆకట్టుకునేలా ఉన్నట్లు చెప్పొచ్చు.