Anupama Parameswaran: 20 ఏళ్ల అమ్మాయి.. నా ఫొటోలు మార్ఫింగ్ చేసింది! నేను షాక‌య్యా..

ABN , Publish Date - Nov 09 , 2025 | 03:24 PM

అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కేరళ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

Anupama Parameswaran

అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కేరళ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నఓ ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రొఫైల్‌ను గుర్తించి  హీరోయిన్ ఆమె కేసు పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అనుపమ (cyber Crime) ఈ వివరాలు తెలిపారు.

‘నా గురించి అసత్య ప్రచారం చేస్తున్న ఓ ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రొఫైల్‌ కొన్ని రోజుల క్రితం నా దృష్టికి వచ్చింది. నా ఫ్యామిలీ, స్నేహితులు, నా సహ నటులే లక్ష్యంగా ఆ ఖాతాలో పోస్ట్ లు పెడుతున్నారు. అందులో మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఆ వేధింపులతో  చాలా  భాధపడ్డాను. నన్ను ద్వేషిస్తూ అదే వ్యక్తి మరికొన్ని ఫేక్‌ అకౌంట్లు సృష్టించినట్టు కూడా తెలిసింది.

దాంతో కేరళ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశా. అధికారులు వెంటనే స్పందించారు. ఈ చర్యల వెనుక ఉన్న వ్యక్తిని కనిపెట్టారు. తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల యువతి ఇదంతా చేసినట్లు తెలిసి షాక్ అయ్యా. తనది చిన్న వయసు. తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేను పూర్తి వివరాలు పంచుకోవాలని అనుకోవడం లేదు. న్యాయపరంగానే ముందుకెళతా’ అని పేర్కొన్నారు.

'ఈ సంఘటన ద్వారా ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. స్మార్ట్‌ ఫోన్  ద్వారా సోషల్ మీడియా వేదికలకు యాక్సెస్‌ ఉన్నంత మాత్రాన   ఇతరులను వేధించడం, డీ ఫేమ్ చేయడం, కక్ష సాధించడం వంటివి చేసే హక్కు ఉండదు. ఆన్‌లైన్‌లో జరిగే చర్యకు ప్రతి చర్య ఉంటుంది. నేను చట్టపరమైన చర్యలు ప్రారంభించాము. చేసిన పొరపాటుకు మూల్యం తప్పదు అని పేర్కొన్నారు. 

Updated Date - Nov 09 , 2025 | 04:32 PM