Anupama Parameswaran: అత‌డితో.. మాట్లాడ‌డం మానేశా

ABN , Publish Date - Sep 22 , 2025 | 09:49 AM

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఓ చిన్న తప్పు తన జీవితంలో మాసిపోని గాయంగా మిగిలిపోయిందని ఇంటర్వ్యూలో వెల్లడించారు. మిత్రుడి చివరి మెసేజ్‌కు రిప్లై ఇవ్వకపోవడం తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు.

Anupama Parameswaran

తాను చేసిన ఓ చిన్న తప్పు తన మనసును తీవ్రంగా గాయపరి చిందని, అది ఇప్ప టికీ సరిదిద్దుకోలేని దిగా తన జీవి తంలో మిగిలిపో యిందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) అన్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

ఓ మిత్రుడితో కొన్ని కారణాల వల్ల మాట్లాడటం మానేశాను, అయితే, అతను నాకు ఓ మెసేజ్ చేశారు. దానికి ముందు రెండు రోజుల క్రితం అతన్ని చూశాను. కానీ, మాట్లాడలేదు. పైగా అతను పంపిన మెసేజు కూడా నేను రిప్లై ఇవ్వలేదు. కారణం.. అతడి వల్ల ఇకపై ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకూడదని భావించాను.

కానీ, రెండు రోజుల తర్వాత అతను బ్లడ్ క్యాన్సర్ తో చనిపోయినట్టు తెలిసింది. ఇదే అతను చనిపోయేముందు నాకు పంపిన జ్లో చెప్పాడు. కానీ, నేను ఇలా ప్రవర్తించడం మనసును ఎంతగానో గాయపరిచింది. ఇప్పటికీ అది ఒక మాసిపోని జ్ఞాపకంగా మిగిలిపోయింది' అన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 09:53 AM