Anudeep Dev: అనుదీప్ దేవ్.. కైలాస శివ పాట విన్నారా!
ABN , Publish Date - Jul 23 , 2025 | 03:53 PM
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు హనుమాన్ ఫేం అనుదీప్ దేవ్ తన సంగీతంలో కాశీ నేపథ్యంలో భక్తి రసాత్మక గీతం రూపొందించాడు.
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు హనుమాన్ ఫేం అనుదీప్ దేవ్ (Anudeep Dev) తన సంగీతంలో తాజాగా కాశీ నేపథ్యంలో భక్తి రసాత్మక పాటను రూపొందించాడు. కైలాస వాస శివ అంటూ సాగే వీడియో అల్బమ్‌ను తన యూ ట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు. కిట్టు విస్సాప్రగడ (Kittu Vissapragada) ఈ పాటకు సాహిత్యం అందించగా విజయ్ ప్రకాశ్ (Vijay Prakash) ఆలపించాడు.
అనుదీప్ దేవ్ (Anudeep Dev), రమణ భార్గవ (Ramana Bhargav) ఈ పాటలో నటించగా నాగ్ అర్జున్ రెడ్డి దర్శకత్వం వహించాడు. తన బామ్మ చివరి కోరిక మేరకు తన అస్థికలను తీసుకుని మొదటిసారిగా కాశీకి వెళ్లిన మనవడికి అక్కడ ఎదురైన పరిస్థితులు, తనకు కలిగిన అనుభూతిని చక్కగా విజువలైజ్ చేశారు. సోమవారం విడుదలైన ఈ పాట మంచి స్పందనను రాబట్టుకుంటోంది.