Anjali Joins Vishal: విశాల్ 35లో అంజలి
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:41 AM
మద గజ రాజా’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు విశాల్. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై..
మద గజ రాజా’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు విశాల్. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్‌బీ చౌదరి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘విశాల్ 35’ వర్కింగ్ టైటిల్. దుషార విజయన్ హీరోయిన్. రవి అరసు దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. తాజగా యూనిట్ ఓ అప్డేట్‌ను పంచుకుంది. ఈ చిత్రంలో కథానాయిక అంజలి కీలకపాత్ర పోషించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం శుక్రవారం తెలిపింది. ‘కొన్నాళ్లుగా నటనా ప్రాధాన్య పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు అంజలి. ‘విశాల్ 35’లోనూ ఆమె పాత్ర ప్రధానాకర్షణగా నిలుస్తుంది, అంజలి పాత్రలోని భిన్నఛాయలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్. సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్