Anil Ravipudi: చిరు తర్వాత ఆ హీరోతోనే సినిమా

ABN, Publish Date - May 08 , 2025 | 05:25 PM

ఇప్పటి దాకా పరాజయం తెలియని దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ ఏడాదిు 'సంక్రాంతికి వస్తున్నాం’తో భారీ విజయాన్ని అందుకుని రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టారు

ఇప్పటి దాకా పరాజయం తెలియని దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) ఈ ఏడాదిు 'సంక్రాంతికి వస్తున్నాం’తో భారీ విజయాన్ని అందుకుని రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టారు. ప్రస్తుతం చిరంజీవితో (Chiranjeevi) ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్తుంది. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సినిమా తర్వాత అనిల్‌ రావిపూడి ఎవరితో సినిమా చేస్తారన్న విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. చిరుతో సినిమా ముగిసిన వెంటనే ఆయన బాలకృష్ణతో సినిమా తీస్తే అవకాశం ఉందని తెలిసింది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే  'భగవంత్  వంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) సినిమా వచ్చింది. అది చక్కని విజయం అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో సినిమా చూసే అవకాశం రానుంది.



‘భగవంత్‌ కేసరి’లో బాలయ్య క్యారెక్టర్‌ చాలా సెటిల్డ్‌గా ఉంటుంది. అప్పటి వరకూ బాలయ్యని ఆ తరహా పాత్రలో చూడలేదు. అనిల్‌ రావిపూడి చూపించిన పద్థతి వేరు. ఆ వైవిధ్యమే భగవంత్‌ కేసరి చిత్రాన్ని నిలబెట్టింది. అనిల్‌ చిత్రాల్లో కూడా ఇది డిఫరెంట్‌ జానర్‌ అని చెప్పచ్చు. ఈసారి కూడా బాలయ్య కోసం అలాంటి కథే డిజైన్‌ చేేస అవకాశం ఉందని సన్నిహితుల నుంచి సమాచారం. ప్రస్తుతం చిరు స్ర్కిప్టులో బిజీగా ఉన్నారు అనిల్‌ రావిపూడి. దీనిని బట్టి చూస్తే 2026 సంక్రాంతి తర్వాతే బాలయ్య సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.  

Updated Date - May 08 , 2025 | 05:25 PM