Anil Ravipudi: వారణాసి గ్లింప్స్‌ చూసి షాకయ్యా.. నయన్‌ని అలా పడేశా..

ABN , Publish Date - Dec 08 , 2025 | 02:09 PM

టాలీవుడ్‌ ఫెయిల్యూర్‌ తెలియని దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి (SS Rajamouli), అనిల్‌ రావిపూడి. సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో బాగా తెలిసిన వారు. రాజమౌళి ఒక టైప్‌లో సినిమాను ప్రమోట్‌ చేస్తే అనిల్‌ (Anil Ravipudi) మరో రకంగా ప్లాన్‌ చేస్తారు.

టాలీవుడ్‌ ఫెయిల్యూర్‌ తెలియని దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి (SS Rajamouli), అనిల్‌ రావిపూడి. సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో బాగా తెలిసిన వారు. రాజమౌళి ఒక టైప్‌లో సినిమాను ప్రమోట్‌ చేస్తే అనిల్‌ (Anil Ravipudi) మరో రకంగా ప్లాన్‌ చేస్తారు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ (varanasi)సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ ఈవెంట్‌ ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగింది. ఈ ఈవెంట్‌లో మహేశ్‌ బాబు ఎద్దుపై వచ్చిన ఎంట్రీ సీన్‌ అనిల్‌ రావిపూడి ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.  

‘ఇటీవల విడుదలైన ‘వారణాసి’ గింప్స్‌ చూసి మహేశ్‌బాబుకు ఫోన్‌ చేసి చాలా సేపు మాట్లాడాను. అంత భారీగా, క్రియేటివ్‌గా ఉంటుందని నేను ఊహించలేకపోయాను. ఆ గ్లింప్స్‌లోని ప్రతి షాట్‌ నన్ను షాక్‌కు గురి చేసింది. ప్రతి ఫ్రేమ్‌ టైమ్‌ ట్రావెలర్‌లా అనిపించింది. రాజమౌళి ఎంత ప్రతిభావంతుడో అందరికీ తెలిసిందే. ఆయన నుంచి మరో అద్భుతం రానుందని ఆ గ్లింప్స్‌ చూశాక అర్థమైంది. ఇటీవల జరిగిన గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌లో మహేశ్‌ ఎంట్రీ ప్లాన్‌ చూసి నాకు మాటలు రాలేదు. ఇలాంటి క్రియేటివ్‌ ఐడియాలు రాజమౌళికి మాత్రమే సాధ్యం’ అని అనిల్‌ రావిపూడి అన్నారు. రాజమౌళి పబ్లిసిటీ ప్లాన్‌ఖు ఫిదా అయినా అనిల్‌ ముందు పెద్ద టాస్కే ఉంది. తన తదుపరి చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా ప్రమోషన్‌ను ఆయన మరింత వినూత్నంగా ప్లాన్‌ చేయాలి. ఈ సినిమాలో చిరంజీవి, వెంకటేశ్‌ ఇద్దరు అగ్ర హీరోలున్నారు. అసలు ప్రమోషన్స్‌కే రానీ నయనతార ఇందులో కథానాయిక. తెలుగులోనే కాదు ఏ భాషలో సినిమా చేసినా ఆమె ప్రమోషన్స్‌కి రాదు. కానీ ఆమెతో పబ్లిసిటీ మొదలుపెట్టిన ఘనత అనిల్‌కే దక్కుతుంది. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘ ఇందులో దాదాపు 20 నిమిషాలలకు పైగా వెంకటేశ్‌ స్క్రీన్  పై సందడి చేస్తారు.  చిరంజీవి, వెంకటేశ్‌ మధ్య వచ్చే క్లైమాక్స్‌ సన్నివేశాలు అదిరిపోతాయి. అందరినీ అలరిస్తాయి. రాబోయే సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ థియేటర్‌లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు’ అని అన్నారు.

పాజిటివిటీతోనే సాధ్యమైంది

నయనతార మామూలుగా ఏ సినిమా ప్రమోషన్‌కు రారు.. ఆమెతో వీడియో చేయించి ప్రమోట్‌ చేయడం మీకెలా సాధ్యమైంది అన్న ప్రశ్నకు ‘ఆమెతో నేను పాజిటివ్‌గా ఉన్నాను. అంతకుమించి చేసింది ఏమీ లేదు. ఆమె ఆ వీడియో చేయడానికి అంగీకరించారు’ అని అనిల్‌ చెప్పారు. 

Updated Date - Dec 08 , 2025 | 02:09 PM