Mutton Soup: మటన్ సూప్ టీజర్ మస్తుంది: అనిల్ రావిపూడి

ABN , Publish Date - Oct 02 , 2025 | 05:43 PM

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి 'మటన్ సూప్' సినిమా టీజర్ ను దసరా సందర్భంగా విడుదల చేశారు. టీజర్ కొత్తగా ఉందని, సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Mutton soup team with Anil Ravipudi

రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’ (Mutton Soup). ‘విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌’ అనేది దాని ట్యాగ్ లైన్‌. ఈ చిత్రాన్ని మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మిస్తున్నారు. ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, మోష‌న్ పోస్టర్, పాటలు... ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదల కాగా అందరినీ ఆకట్టుకున్నాయి.


దసరా సందర్భంగా బుధవారం ‘మటన్ సూప్’ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను లాంచ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘మటన్ సూప్’ టైటిల్ చాలా బాగుంది. టీజర్ ఇంకా బాగుంది. టీం కూడా చాలా కొత్తగా ఉంది. దర్శకుడు రామచంద్రకు, హీరో రమణ్‌కు, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 10న చిత్రం రాబోతోంది. అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలి’ అని అన్నారు.

నిర్మాత మల్లిఖార్జున ఎలికా మాట్లాడుతూ ‘గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మా టీజర్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మంచి స్క్రీన్ ప్లేతో మా చిత్రం రాబోతోంది. అందరూ వీక్షించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ, ‘క్రమశిక్షణకు, నిబద్దతకు మారు పేరు అయిన సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మా టీజర్‌ను లాంచ్ చేయడం మా అదృష్టం. మా నిర్మాతలు నాకు ఎంతో అండగా నిలిచారు. రమణ్ ఎంతో గొప్పగా నటించారు. మా అందరినీ ముందుండి నడిపిస్తున్న పర్వతనేని రాంబాబు గారికి థాంక్స్. గొప్పగా నటించిన గోవింద్, జెమినీ సురేష్ గార్లకు అభినందనలు. నాకు అండగా నిలిచిన సునీత అక్కకి థాంక్స్. ఈ సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయాలని, పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


నిర్మాతలు రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి మాట్లాడుతూ, ‘ట్రెండ్‌కు తగ్గ కథ ఇది. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంది. దర్శకుడు రామచంద్ర సినిమాను చక్కగా తెరకెక్కించారు. హీరో రమణ్, వర్షా విశ్వనాథ్, జెమినీ సురేష్ సహా అందరి పెర్ఫామెన్స్ మెప్పిస్తుంది’ అని చెప్పారు. హీరో రమణ్ మాట్లాడుతూ... ‘మటన్ సూప్’ టీజర్‌ను లాంచ్ చేసిన గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి థాంక్స్. మా దర్శక, నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ మూవీని రూపొందించారు. టీజర్ చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ, ‘మటన్ సూప్’ మంచి విజయాన్ని అందుకుంటుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెమినీ సురేశ్‌, నటుడు గోవింద్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

Also Read: Nandamuri Balakrishna: పట్టాలెక్కబోతున్న బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా...

Also Read: Little Hearts: చిన్న మార్పులతో.. హిట్టు సినిమాకు సీక్వెల్‌

Updated Date - Oct 02 , 2025 | 06:29 PM