Pawan Kalyan: తెలంగాణ‌ ఆవిర్భావ దినోత్స‌వం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పోస్టు వైర‌ల్

ABN , Publish Date - Jun 02 , 2025 | 08:56 AM

ఆంధ్ర‌ ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వన్ క‌ల్యాణ్ తెలంగాణపై త‌న‌కున్న ప్రేమ‌ను మ‌రోసారి చాటుకున్నారు.

pawan kalyan

ఆంధ్ర‌ ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వన్ క‌ల్యాణ్ (Pawan Kalyan) తెలంగాణపై త‌న‌కున్న ప్రేమ‌ను మ‌రోసారి చాటుకున్నారు. జూన్ 2 తెలంగాణ‌ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం (Telangana Formation Day) సంద‌ర్భంగా త‌న‌దైన శైలిలో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇప్పుడు ఈ పోస్టు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఆయ‌న ఏమ‌ని పోస్టు చేశారంటే..

జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

pawan.PNG

Updated Date - Jun 02 , 2025 | 08:57 AM