RAPO22: రామ్ పోతినేని 22.. టైటిల్ ఇదేనా
ABN, Publish Date - May 11 , 2025 | 02:10 PM
రామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈనెల 15న టైటిల్ ప్రకటిస్తామని ప్రకటించారు. దీని కోసం ఓ గ్లింప్ కూడా విడుదల చేశారు.
రామ్ (Ram Pothineni)హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. భాగ్యశ్రీ (bhagyashri borse) బోర్సే కథానాయిక. ఈనెల 15న టైటిల్ ప్రకటిస్తామని ప్రకటించారు. దీని కోసం ఓ గ్లింప్ కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పుడు ఇదే టైటిల్ ఖరారు చేయబోతున్నారని టాక్. కాకపోతే ఈ సినిమాలో ఆంధ్రా కింగ్ రామ్ కాదు. ఉపేంద్ర. ఓ స్టార్ హీరో అభిమానిగా రామ్ నటించిన సినిమా ఇది. ఆ స్టార్ హీరో ఉపేంద్ర అన్నమాట. ‘నేను ఫలానా హీరో తాలుకా’ అని చెప్పడానికి హీరో ఈ మాట ఉపయోగిస్తుంటారు. అసలు విషయం అది.
పవన్ కల్యాణ్ అభిమానులు ‘పిఠాపురం ఎం.ఎల్.ఏ తాలుకా’ అనే మాటని బాగా వైరల్ చేశారు. కాబట్టి ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ (Andhra King Taluka) అనేది త్వరగా జనంలోకి వెళ్తుందని మేకర్స్ భావించినట్లు ఉన్నారు. అయితే ఈ సినిమా కఽథ, హీరో గురించి ఎలాంటి క్లూ బయటకు రాలేదు. పిరియాడిక్ డ్రామా అని సమాచారం. ఈ చిత్రం బాలకృష్ణని తీసుకొద్దాం అనుకొన్నారు. మోహన్ లాల్ పేరు కూడా వినిపించింది. చివరకు ఉపేంద్ర వచ్చి చేరారు. ఈ చిత్రానికి మహేశ్‌బాబు పి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.