Aandhra King Taluka: ఒకరోజు ముందే వస్తున్న ఆంధ్రా కింగ్..
ABN , Publish Date - Nov 16 , 2025 | 09:08 PM
రామ్ పోతినేని (Ram Pothineni), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) జంటగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka).
Aandhra King Taluka: రామ్ పోతినేని (Ram Pothineni), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) జంటగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికీ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై హైప్ ను కూడా క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా కోసం రామ్ చాలా కష్టపడ్డాడు. లిరిసిస్ట్ గా మారి లిరిక్స్ రాశాడు. సింగర్ గా మారి సాంగ్ కూడా పాడాడు.
కొన్నేళ్లుగా రామ్ కెరీర్ లో విజయాలు లేవు. ఎలాగైనా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇంకోపక్క భాగ్యశ్రీ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఆమె నటించిన మూడు సినిమాలు పరాజయాలను అందుకున్నాయి. ఇక ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 28 న రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.
నవంబర్ 18 న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ ఒకరోజు ముందుకు జరిగినట్లు తెలిపి మేకర్స్ షాక్ ఇచ్చారు. నవంబర్ 27 నే ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. దీంతో మొదట షాక్ అయిన అభిమానులు.. ఆ తరువాత హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఈ సినిమాతోనైనా రామ్, భాగ్యశ్రీ జంట హిట్ అందుకుంటుందేమో చూడాలి.