Bad Girlz Trailer: నేను అంత ఫ్రెష్‌ కాదు స‌ర్.. ఇంట‌ర్‌లో డీజే టిల్లుతో చాలా ఎఫైర్లు ఉన్నాయి

ABN , Publish Date - Dec 22 , 2025 | 05:34 PM

క్రిస్మ‌స్ సెల‌వుల నేప‌థ్యంలో ఈ శుక్ర‌వారం తెలుగు నుంచే అర డ‌జ‌న్ చిత్రాలు థియేట‌ర్ల‌కు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

Bad Girlz

క్రిస్మ‌స్ సెల‌వుల నేప‌థ్యంలో ఈ శుక్ర‌వారం తెలుగు నుంచే అర డ‌జ‌న్ చిత్రాలు థియేట‌ర్ల‌కు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. వీటిలో అన్ని చిత్రాలు ప్ర‌మోష‌న్ల ప‌రంగా దూసుకుపోతూ ప్ర‌తి సినిమాపై ఏదో ర‌కంగా బ‌జ్ క్రియేట్ చేశాయి. వీటిలో బ్యాడ్ గ‌ర్ల్స్ (Bad GirlZ) అనే అడ‌ల్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ కూడా ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాట‌లు, పోస్ట‌ర్స్‌, టీజ‌ర్స్ అన్నీ మంచి రెస్పాన్స్ రాబ‌ట్టుకున్నాయి. గ‌తంలో గ‌తంలో యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా వ‌చ్చిన‌ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాను డైరెక్ట్ చేసిన ఫణి ప్రదీప్ (Phani Pradeep) ఈ సినిమాను రూపొందించ‌డం విశేషం. అనూప్ రూబెన్స్ (Anup Rubens) సంగీతం అందించ‌గా ఇలా చూసుకుంటానే అనే ఓ పాట మాత్రం ఓ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది.

కాగా ఈ చిత్రం క్రిస్మ‌స్ సెల‌వుల దృష్ట్యా డిసెంబ‌ర్‌25న ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌స్తోంది. రోహన్ సూర్య (Rohan Surya), మొయిన్ (Mohi), అంచల్ గౌడ (Anchal), పాయల్ చెంగప్ప (Payal Chengappa), రోషిణి (Roshni Sahota), యష్ణ ముత్త‌లూరి (Yashnae Muthuluri) లీడ్ రోల్స్‌లో న‌టించారు. తాజాగా సోమ‌వారం ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌ను చూస్తుంటే.. ఈ సినిమాలోనూ మ్యాట‌ర్ మాములుగా లేదుగా అని అనుకునేలా ఉంది. న‌లుగురు ఒంట‌రి ప‌ల్లెటూరు అమ్మాయిలు రోజు వారీ ప‌నుల‌కు బ్రేక్ ఇచ్చి ఎంజాయ్ చేయ‌డానికి మ‌లేషియాకు వెళ్ల‌డం, అక్క‌డికి వెళ్లిన వారు కొత్త‌గా మ‌గ తోడు కోరుకోవ‌డం, బాయ్ ఫ్రెండ్స్ రావ‌డం ఈ క్రమంలో వ‌చ్చే సంభాష‌ణ‌లు జెన్ జీ ట్రెండ్‌ను మ‌క్కీకి మ‌క్కి దింపిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

అంతేగార రేణు దేశాయ్‌, యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు సీన్లు కూడా స‌ర్‌ఫ్రైజ్ చేశాయి. అంతేగాక హీరోయిన్ల‌ తోటి, స్ర‌వంతితో చెప్పించే డ‌బుల మీనింగ్ డైలాగులు యూత్‌ను టార్గెట్ చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా మ‌లేషియా వ‌చ్చాం క‌దా బాగా ఓపెన్ అయిపోదామా, మీకేంటే పొట్టి పొట్టి బ‌ట్ట‌లేసుకుని క‌త్తిలాగా ఉన్నారు, అంచ‌ల్‌తో శ్రీకాకుళం యాష‌లో చెప్పించిన మ‌న‌కు మ‌గ తోడు కావాలే, మీరు మీరు ఏం చేసుకుంటారో నాకేట్లా తెలుస్తది చిన్న పిల్ల‌ను క‌దా, మీరు కూడా నెట్‌ఫ్లిక్స్ తో థ్రిల్ల‌ర్ సినిమాలు చూస్తారటే వంటివి ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

అంతేగాక మ‌రో హీరోయిన్‌తో తెలంగాణ యాస‌లో మీర‌నుకున్న‌ట్లు అంత ఫ్రెష్‌ కాదు స‌ర్ నేను ఇంట‌ర్‌లో డీజే టిల్లుతో ఎఫైర్లు ఉన్నాయి నాకు అని అన‌డం దానికి డాన్ ఫ‌స్ట్ నేను నిన్నే రేప్ చేస్త అన‌గానే కావాలంటే ఫస్ట్‌ న‌న్ను చూస్ చేసుకోండి సార్ అని స్ర‌వంతి అన‌డం దానికి డాన్ ఇది రీసెంట్ సినిమా నువ్వు ఎప్పుడో రిలీజ్ అయిన ఓటీటీ సినిమావు అంటౌ సాగే పంచులు, ప్రాస‌ల‌తో పాటు వెద‌వ వ‌స్తే మెమ‌రీస్ మిగులుతాయి అదే మంచోడు వ‌చ్చాడ‌నుకోండి మెమ‌రీస్ పెరుగుతాయి అంటూ మంచి మెసేజ్‌తో కూడిన డైలాగ్స్ కుర్ర‌కారుకు ఇట్టే క‌నెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే సినిమాల పోటీ ప‌డి రిలీజ్ అవుతున్న క్ర‌మంలో ఈ సినిమా టికెట్ కేవ‌లం రూ.99 ఫిక్స్ అంటూ మేక‌ర్స్ ప్ర‌క‌టించడం విశేషం.

Updated Date - Dec 22 , 2025 | 05:38 PM