Anasuya: అనసూయ అందాల విందు..  

ABN , Publish Date - Jun 14 , 2025 | 07:16 PM

జబర్దస్త్(Jabardasth) షో  ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj). 

Anasuya

Anasuya: జబర్దస్త్(Jabardasth) షో  ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj).  చిన్న చిన్న డ్రెస్ లు వేసుకొని అందాలను ఆరబోస్తూ.. ఆ షోకు  గ్లామర్ టచ్ ఇచ్చి హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఇక జబర్దస్త్  షో ద్వారా వచ్చిన గుర్తింపుతో  సినిమాల్లో కూడా సపోర్టివ్ రోల్స్ చేస్తూ వచ్చింది. అంతేకాకుండా స్టార్ హీరోలతో కలిసి స్పెషల్ సాంగ్స్ లో స్టెప్స్ వేసి మరింత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం అనసూయ ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క బుల్లితెర షోస్ తో బిజీగా మారింది.

 

ఇక సోషల్ మీడియాలో అనసూయకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ  ఇన్స్టాగ్రామ్ ను హీటెక్కిస్తూ ఉంటుంది. ఇక తాజాగా అనసూయ అందాల విందు సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం ఆమె.. ఒక టీవీ ఛానెల్ లో గేమ్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈ గేమ్ షో మొదటి సీజన్ ఎన్నో విమర్శలను అందుకుంది. శేఖర్ మాస్టర్, అనసూయ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ  షోలో అసభ్య పదాలు ఎక్కువ ఉండడంతో పాటు.. ఫ్యామిలీస్ కలిసి చూడకూడని విధంగా ఆ గేమ్స్ ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కూడా సీజన్ 1 సక్సెస్ అయ్యిందని సీజన్ 2 ను మొదలుపెట్టారు.

 

Kannappa Trailer: అద్భుతమైన విజువల్స్ తో కన్నప్ప ట్రైలర్..  హైలైట్ గా ప్రభాస్

 ఇక ఇందులో కూడా అనసూయ అందాల విందు మాత్రం  తగ్గడం లేదు. ప్రతి ఎపిసోడ్ కు ఆమె అందం గ్లామర్ తో నిండిపోతుంది.  డిజైనర్ డ్రెస్ ల దగ్గర నుంచి చీరల వరకు అన్నింటిలో  గ్లామర్ కనిపించేలా చూసుకుంటుంది అనసూయ. తాజాగా అనసూయ మరోసారి గ్లామర్ గేట్లు ఎత్తేసింది.  గ్రీన్ ఆఫ్-షోల్డర్ సీక్విన్డ్ మిడి పార్టీ డ్రెస్ లో అనసూయ అందాల విందు మాములుగా లేదు.

 

 డిఫరెంట్ మేకప్ తో.. డిజైనర్ డ్రెస్ లో ఘాటు ఫోజులతో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఆమె ఎదపై ఉన్న  టాటూ హైలైట్ గా కనిపిస్తుంది. ఆ స్లీవ్ లెస్ డ్రెస్ లో ఎదపై ఆ టాటూ కనిపించడంతో చాలామంది ఆ టాటూ ఎవరిది అని ఆరాలు తీస్తున్నారు. ఎంగేజ్ మెంట్ డేట్, తన భర్త భరద్వాజ్ పుట్టినరోజు డేట్ ఒక్కరోజే కావడంతో దానికి గుర్తుగా ఆమె ఎదపై నిక్కు అనే టాటూ వేయించుకుంది.  ప్రస్తుతం అనసూయ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే.. హరిహర వీరమల్లు సినిమాలో  ఒక సాంగ్ లో  నర్తించింది.  త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Updated Date - Jun 14 , 2025 | 07:18 PM