Anasuya Bharadwaj: అన‌సూయ.. ఈ లెవ‌ల్‌లో రెచ్చి పోయిందేంటి! ప్రభుదేవ‌తో.. రొమాంటిక్ సాంగ్‌

ABN , Publish Date - Nov 06 , 2025 | 06:48 PM

ప్రభుదేవాతో కలిసి అనసూయ భరద్వాజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది

Anasuya Bharadwaj

ప్రభుదేవా (Prabhu Deva), రాయ్ లక్ష్మీ (Raai Laxmi), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వోల్ప్ (Wolf). ఎప్పుడో రెండు రెండేండ్ల క్రితం 2023 ఆగస్టులో టీజ‌ర్ విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ ఓ అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా నుంచి సాసా సాసా అంటూ సాగే త‌మిళ లిరిక‌ల్ వీడియో పాట‌ను గురువారం విడుద‌ల చేశారు. ఇప్పుడీ పాట సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఇంట‌రిగా ఉన్న ప్ర‌భుదేవ ఇంట్లోకి ముగ్గురు ముద్దుగుమ్మ‌లు ఒక్కొక్క‌రిగా ఎంట్రీ ఇవ్వ‌డం ఆపై ఆ ముగ్గురు చాటుగా మొబైల్‌లో వీడియో తీస్తూ హీరోను క‌వ్విస్తూ స‌ర‌స‌స‌ల్లాపాలు ఆడ‌డం వంటి థీమ్‌తో సాంగ్ రొమాంటిక్ టచ్‌లో సాగింది. ప్రభుదేవా ఇంటికి వచ్చిన ముగ్గురు లేడీస్‌తో రొమాన్స్ సన్నివేశాలు యూత్‌లో హీట్ పుట్టిస్తున్నాయి. మెలోడియస్ బీట్స్‌కి తోడు, ప్రతి షాట్‌లో కూడా స్టైలిష్ ప్రెజెంటేషన్ కనిపిస్తోంది. త్రీస‌మ్ సాంగ్ కావ‌డంతో కుర్ర‌కారు వేగంగా ఈ పాట‌కు క‌నెక్ట్ అవుతున్నారు.

ప్రభుదేవా 60వ సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి వినూ వెంకటేష్ దర్శకత్వం వహించ‌గా సందేశ్ నాగరాజు మరియు సందేశ్ ఎన్ నిర్మాతలు. తెలుగు యాంక‌ర్ అనసూయ భరద్వాజ్ ఓ తాంత్రికురాలి పాత్రలో కనిపించనుండ‌డం విశేషం. ఆమె రోల్ హర్రర్–రోమాన్స్ మిక్స్‌గా ఉండబోతోందని సమాచారం. అయితే ఈ పాటను చూసిన వారంతా ఏంటి అన‌సూయ ఇలాంటి పాట‌లో న‌టించింది. అంత అవ‌స‌రం ఏం వ‌చ్చిందంటూ ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

లేచిన ద‌గ్గ‌రి నుంచి సూక్తులు చెప్పేవారు ఇలాంటి పాట‌లో న‌టిస్తారా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. చూస్తుంటే రెండు మూడు రోజుల్లో ఈ పాట‌, అన‌సూయ సామాజిక మాధ్య‌మాల్లో గ‌ట్టిగానే ట్రోల్ అవ‌క త‌ప్ప‌దూమో అనిపిస్తుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం త‌మిళంతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

Updated Date - Nov 06 , 2025 | 06:59 PM