Anaganaga Oka Raju: ఏంటి.. సంక్రాంతికి రాజుగారు రావడం లేదా..
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:35 PM
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty), మీనాక్షీ చౌదరి(Meenakshi Chaudhary)జంటగా మారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Anaganaga Oka Raju: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty), మీనాక్షీ చౌదరి(Meenakshi Chaudhary)జంటగా మారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్ అంతా మంచి ఆదరణను అందుకున్నాయి. ఎన్నో ఏళ్లగా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తూ ఉంది. ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రాజుగారు దిగుతున్నారు అంటూ మేకర్స్ ప్రకటించారు. దీంతో అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ మధ్యనే నవీన్ పోలిశెట్టి ప్రమోషన్స్ తో అదరగొట్టాడు. అయితే అది కూడా మూడునాళ్ళ ముచ్చటగా మారిపోయింది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంక్రాంతి బరిలో కూడా రాజుగారు రావడం లేదని తెలుస్తోంది. చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, ప్రభాస్ ది రాజా సాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, విజయ్ జన నాయగన్, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి లైన్ లో ఉన్నాయి. ఇక ఇన్ని సినిమాలతో పోటీ తట్టుకోలేక రాజుగారు డ్రాప్ అయ్యారని, సంక్రాంతి రేసు నుంచి నవీన్ తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అందుకే ప్రమోషన్స్ కూడా మధ్యలోనే ఆపేశారని సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలపనున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.