Anaganaga oka raju: నవీన్‌, మీనాక్షి కలిసి కామెడీ కుమ్మేసేలా ఉన్నారుగా..

ABN , Publish Date - Sep 26 , 2025 | 01:00 PM

నవీన్‌ పోలిశెట్టి కథల ఎంపిక భిన్నంగా ఉంటుంది. తన చిత్రాలు రెగ్యులర్‌ ఫార్మెట్‌ కాకుండా కొత్తదనాన్ని ప్రేక్షకులకు పంచుతాయి. అందుకు అతన్ని గత చిత్రాలే నిదర్శనం.

Anaganaga oka raju Teaser


నవీన్‌ పోలిశెట్టి (Naveen Polishetty) కథల ఎంపిక భిన్నంగా ఉంటుంది. తన చిత్రాలు రెగ్యులర్‌ ఫార్మెట్‌ కాకుండా కొత్తదనాన్ని ప్రేక్షకులకు పంచుతాయి. అందుకు అతన్ని గత చిత్రాలే నిదర్శనం. తాజాగా ఆయన హీరోగా వస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga oka raju) . మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) కథానాయికగా మారి (Maari) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే  ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌, ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ ప్రకటించారు. ఈ సంక్రాంతికి వినోదాల విందే అంటూ టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్‌లో హీరో నవీన్‌ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి సందడి చేశారు. బంగారు ఆభరణాల ప్రకటనపై స్పూఫ్‌ తో మొదలైన ఈ టీజర్‌ వినోదాత్మకంగా, వైవిధ్యంగా ఉంది. ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించిన  మీనాక్షి చౌదరి, తమ సినిమా గురించి మాట్లాడమంటే ఆమె కాకుండా ఆభరణాల గురించి మాట్లాడుతుండటంతో ఫన్‌ క్రియేట్‌ చేస్తుంది. బంగారాన్ని చూడగానే ఆడవారి ఆలోచనలు ఎలా ఉంటాయో ఇందులో చూపించారు. సినిమా ప్రమోషన్స్‌ కోసం అదే ఆభరణాలను నవీన్‌ ధరించడం ఫన్‌ క్రియేట్‌ చేసింది.  ఆద్యంతం ఈ టీజర్‌ వినోదాత్మకంగా ఉంది. టీజర్‌లో మిక్కీ జె మేయర్‌ సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది. నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి పోటాపోటీగా నవ్వులు పంచారు. సినిమా టైటిల్‌ కూడా సంక్రాంతి పండుగకు పర్ఫెక్ట్‌గా మ్యాచ్‌ అయ్యేలా ఉంది. అలాగే టీజర్‌ చివర్లో పండుగ ఉత్సాహం, రంగురంగుల సెట్లు, మాస్‌ అంశాలతో  చూపించారు. ఈ సంక్రాంతికి వినోదాల విందే అన్నట్లు టీజర్‌ కట్‌ ఉంది. ఈ చిత్రానికి నవీన్‌ పోలిశెట్టి హీరో కావడమే కాకుడాఆ రచయిత కావడం విశేషం. ఈ టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. 

Updated Date - Sep 26 , 2025 | 01:12 PM