అమ్మ గొప్పతనాన్ని ఆవిష్క‌రించే ‘అమ్మ’

ABN , Publish Date - May 09 , 2025 | 04:20 PM

అమ్మ అంటే ఆలనా, అమ్మ అంటే ఆప్యాయత, అమ్మ అంటే అనురాగం. అలాంటి అమ్మ విలువను గుర్తిస్తూ తెరకెక్కుతున్న సందేశాత్మక షార్ట్ మూవీ ‘అమ్మ’(Amma).



అమ్మ అంటే ఆలనా, అమ్మ అంటే ఆప్యాయత, అమ్మ అంటే అనురాగం. అలాంటి అమ్మ విలువను గుర్తిస్తూ తెరకెక్కుతున్న సందేశాత్మక షార్ట్ మూవీ ‘అమ్మ’(Amma). ఏఏఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో, 'నాట్యమార్గం' సహకారంతో ఈ షార్ట్ ఫిలిం.. మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా మే 11న‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇందులో  ప్రముఖ నృత్యకారిణి అభినయశ్రీ ఇంద్రాణి దవలూరి తెర‌పై ‘అమ్మ’గా లాలించ‌బోతోంది. ఇంద్రాణి దవలూరి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన “అందెల రవమిది” మూవీ విడుద‌ల‌కు ముందే ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క‌ అవార్డులు అందుకుంది. తాజాగా ‘అమ్మ’ మూవీలోనూ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు.  ఆమె మాట్లాడుతూ, "ఏమీ యాచించని నిస్వార్థ ప్రేమమూర్తి అమ్మ. అలాంటి ఓ అమ్మ కథను చూపించే సందేశాత్మక చిత్రమే మా ‘అమ్మ’ మూవీ అని అన్నారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం అందించిన హరీష్ బన్నాయ్ మాట్లాడుతూ, "మనకి కష్టం వస్తే కన్నీరు కార్చే అమ్మకే బాధ కలిగిస్తే ఆమె పడే ఆవేదన ఎలా ఉంటుంది? కొవ్వొత్తిలా కరిగి మనకు దారి చూపించే అమ్మకు మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? ఇదే మా మూవీ సబ్జెక్ట్," అని తెలిపారు.
 

Updated Date - May 09 , 2025 | 04:21 PM