Amitabh Bachchan: మహిళలు గర్వంగా చెప్పుకోవాలి..
ABN , Publish Date - Oct 06 , 2025 | 04:32 PM
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్ పతి’ షోలో మహిళను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (Amitabh bachchan) వ్యాఖ్యాతగా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్ పతి’ షోలో మహిళను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన కొందరు మహిళలను మీరు ఏం చేస్తుంటారని అమితాబ్ అడిగారు. అందులో కొందరు ‘నేను గృహిణిని’ అని చిన్నగా చెబుతారు. అదేం తప్పు కాదు.. గర్వంగా, పెద్దగా చెప్పాల్సిన విషయమది. ఇంటిని చక్కబెట్టే యజమానిగా ప్రతి మహిళా గర్వపడాల్సి విషయమది.
భర్త, పిల్లలు, అందరికీ వంట చేయడం, వేళకు అన్ని పనులు చేయడం అంత తేలికైన పని కాదు. చాలామందికి పురుషులు కొవిడ్ సమయంలో ఈ విషయం అర్థమైంది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉన్నవారికి ఆ పనులు చేయడం ఎంత కష్టమో తెలిసింది’ అని బచ్చన్ అన్నారు. అమితాబ్ మాటలకు అక్కడ ఉన్నవారంతా చప్పట్లతో ఆడిటోరియంలో మార్మోగిపోయేలా చప్పట్లు కొట్టారు.