ప్రేక్షకులను మెప్పించే ప్రేమకథ

ABN , Publish Date - Jun 06 , 2025 | 05:19 AM

అమర్‌దీప్‌ చౌదరి, సుప్రీతా నాయుడు జంటగా నటిస్తున్న చిత్రం ‘చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి’. మాల్యాద్రిరెడ్డి దర్శకత్వంలో మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మిస్తున్నారు. ఇటీవలె నిర్వహించిన కార్యక్రమంలో..

అమర్‌దీప్‌ చౌదరి, సుప్రీతా నాయుడు జంటగా నటిస్తున్న చిత్రం ‘చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి’. మాల్యాద్రిరెడ్డి దర్శకత్వంలో మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మిస్తున్నారు. ఇటీవలె నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా మహేంద్రనాథ్‌ కూండ్ల మాట్లాడుతూ ‘షూటింగ్‌ పూర్తి చేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. గాఢతతో నిండిన ప్రేమకథాంశంతో రూపొందించిన చిత్రమిది. హీరో హీరోయిన్ల అభినయం మా సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. భావోద్వేగాలతో పాటు వాణిజ్యహంగులతో దర్శకుడు చిత్రాన్ని రూపొందించారు’ అని చెప్పారు. మంచి పాటలు, ఆకట్టుకునే రొమాంటిక్‌ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలు, అదరగొట్టే యాక్షన్‌ సీక్వెన్స్‌ ఈ చిత్రంలో మిళితమై ఉంటాయి’ అని అమర్‌దీప్‌ చౌదరి చెప్పారు.

Updated Date - Jun 06 , 2025 | 06:44 AM