Allu Arjun: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పాత్రలో అల్లు అర్జున్..

ABN , Publish Date - Jul 12 , 2025 | 07:16 PM

ఒకప్పుడు హీరోలు.. డబుల్, త్రిబుల్ రోల్స్ లో కనిపించేవారు. సీనియర్ ఎన్టీఆర్ అయితే ఏకంగా నాలుగు పాత్రల్లో నటించిన సినిమాలు కూడా ఉన్నాయి.

AA22

Allu Arjun: ఒకప్పుడు హీరోలు.. డబుల్, త్రిబుల్ రోల్స్ లో కనిపించేవారు. సీనియర్ ఎన్టీఆర్ అయితే ఏకంగా నాలుగు పాత్రల్లో నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో అలాంటి సాహసాలు ఎవరు చేయడం లేదు. మహా అయితే తండ్రీకొడుకులుగా కనిపిస్తున్నారు కానీ, అంతకుమించి ఎక్కువ రోల్స్ లో నటించడం లేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) ఈసారి ఆ రిస్క్ చేస్తున్నాడు అని టాక్ నడుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పాత్రల్లో కనిపిస్తున్నాడు అని సమాచారం.


ఇప్పటివరకు అల్లు అర్జున్ డబుల్ రోల్ లో కూడా నటించలేదు. టాలీవుడ్ లో ఇప్పటివరకు ద్విపాత్రాభినయం చేయని హీరోగా బన్నీకి ఒక రేర్ రికార్డ్ ఉంది. ఇప్పుడు అట్లీ సినిమా కోసం ఆ రికార్డ్ ను బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ ను కూడా పక్కన పెట్టి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఏఏ22 ను మొదలుపెట్టిన విషయం తెల్సిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.


ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా మరో ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు అని టాక్ నడిచింది. పుష్ప 2 తో బన్నీ వెయ్యి కోట్లు.. జవాన్ తో అట్లీ వెయ్యి కోట్లు కొల్లగొట్టి రికార్డ్ సృష్టించారు. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి రెండు వేల కోట్లను కొల్లగొట్టడానికి భారీ ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టుగానే సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ సినిమాలు నాలుగు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాడట.


సినిమాలో ఉండే ఫ్యామిలీ ట్రీ మొత్తంలో కూడా అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తాడట. తాతగా, తండ్రిగానే కాకుండా ఇద్దరు కొడుకులుగా కూడా బన్నీనే చూపించనున్నారట. నిజం చెప్పాలంటే ఇది పెద్ద సాహసం. బన్నీనే సినిమా మొత్తం కనిపిస్తే అది ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఒక్కసారే నలుగురు బన్నీలు స్క్రీన్ పై కనిపిస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే కథ ప్రకారం ప్యారలల్ యూనివర్స్ లో ఈ నలుగురు కనిపించబోతున్నారని అంటున్నారు. అంటే పూర్వ జన్మ.. భవిష్యత్, వర్తమానం ఇలా ఒక్కోదాంట్లో ఒక్కో బన్నీని చూపిస్తారంట. ఈ విషయం తెలియడంతో అల్లు ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.


ఇక ఇందుకోసమే అట్లీ నలుగురు హీరోయిన్స్ ను తీసుకుంటున్నాడని, ఒక్కో బన్నీకి ఒక్కో హీరోయిన్ ఉంటుందని టాక్ నడుస్తుంది. త్వరలోనే ఒక్కో హీరోయిన్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. ఏదిఏమైనా అట్లీ మాత్రం ఈసారి బన్నీతో చాలా గట్టి ప్లానే వేశాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో వీరిద్దరూ ఇండస్ట్రీ రికార్డులను ఎలా బద్దలుకొడతారో చూడాలి.

Anurag Kashyap: చెత్త కంటెంట్ చూపించి నెట్ ఫ్లిక్స్ డబ్బులు గుంజుతుంది

Updated Date - Jul 12 , 2025 | 07:16 PM