Allu Arjun: అల్లు వారింట రాఖీ.. వీడియో చూశారా
ABN , Publish Date - Aug 11 , 2025 | 10:49 PM
అల్లు అర్జున్ (Allu Arjun) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అరవింద్ వారసుడిగా గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై అంచలంచలుగా ఎదిగాడు. ఇక పెళ్లి వరకు బన్నీ తీరు వేరు. అతడిని పూర్తిగా మార్చేసింది భార్య స్నేహరెడ్డి(Sneha Reddy).
Allu Arjun: అల్లు అర్జున్ (Allu Arjun) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అరవింద్ వారసుడిగా గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై అంచలంచలుగా ఎదిగాడు. ఇక పెళ్లి వరకు బన్నీ తీరు వేరు. అతడిని పూర్తిగా మార్చేసింది భార్య స్నేహరెడ్డి(Sneha Reddy). ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అల్లు అయాన్, అల్లు అర్హ. వీరిద్దరూ కూడా సోషల్ మీడియాలో చిన్నపాటి సెలబ్రిటీలు అని చెప్పొచ్చు. అల్లు అయాన్ మోడల్ అంటూ మీమ్స్ పేజీలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు.
ఇక అల్లు అర్హ పుట్టినప్పటి నుంచే సెలబ్రిటీ. ముద్దు ముద్దు మాటలతో తండ్రితో కలిసి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. అంతేనా శాకుంతలం సినిమాలో బాలనటిగా కూడా నటించి మెప్పించింది. ఇద్దరు పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ బన్నీ భార్య స్నేహ రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పండగలు, ఫంక్షన్స్ ఫోటోలు అయితే అస్సలు మిస్ అవ్వదు.
ఇక తాజాగా స్నేహ అల్లువారి ఇంట జరిగిన రాఖీ వేడుకలను అభిమానులతో పంచుకుంది. అన్న అయాన్ కు అర్హ రాఖీ కట్టడం, అల్లు వారసులకు రాఖీలు కట్టడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అర్హ.. అయాన్ కు రాఖీ కట్టి అన్న ఆశీర్వాదం తీసుకోవడం, అయాన్ చెల్లిని ఆశీర్వదించడం ఎంతో ముద్దుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే కేవలం పిల్లలు రాఖీ సెలబ్రేషన్స్ మాత్రమే చూపించారు. బన్నీ ఎవరి చేత రాఖీ కట్టించుకున్నాడు అనేది చూపించలేదు.