Telugu Indian Idol: ఈ సారి.. ‘తెలుగు ఇండియన్ ఐడల్’ కు పెట్టుబ‌డి పెడ‌దామ‌నుకున్నాం

ABN , Publish Date - Sep 10 , 2025 | 06:47 PM

ఇప్పటికే మూడు సీజన్లుగా వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించిన‌ ‘తెలుగు ఇండియన్ ఐడల్’

Telugu Indian Idol

ఇప్పటికే మూడు సీజన్లుగా వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించిన‌ ‘తెలుగు ఇండియన్ ఐడల్’ (IndianIdol Season 4) నాలుగో సీజన్ మ‌రోసారి ఆహా (Aha OTT) ఓటీటీలో ప్రేక్ష‌కుల‌ను బాగా అల‌రిస్తోంది. ఈ సీజన్‌లో టాప్ 12 కంటెస్టెంట్స్ వారి అద్భుతమైన పాటలతో ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు ఆహాలో సందడి చేస్తున్నారు. ఈ షోకు ఎప్ప‌టిలానే ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ (Thaman), గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి (Geetha Madhuri) జడ్జ్‌లుగా, శ్రీరామచంద్ర (Sriram Chandra) హోస్ట్‌గా, సమీరా భరద్వాజ్ (Samira Bhardwaj) కో-హోస్ట్‌గా పని చేస్తున్నారు.

తాజాగా.. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్పెషల్ స్క్రీనింగ్ తరువాత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సింగర్‌లు, సంగీత దర్శకులు, నిర్మాతలు తమ అనుభూతులను పంచుకున్నారు. ఈ క్ర‌మంలో సమీరా భరద్వాజ్ మాట్లాడుతూ.. “ఇలాంటి ప్రెస్టీజియస్ షోలో హోస్ట్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉంది. అల్లు అరవింద్ గారు, తమన్ గారికి నా ధన్యవాదాలు. ఈ షో గురించి నా ప్రతి మాట నా మనసులో నుంచే వస్తోంది అన్నారు.”

గీతా మాధురి మాట్లాడుతూ.. “ఇది వరుసగా మూడోసారి జడ్జ్‌గా పని చేస్తున్నాను. నేను కూడా రియాలిటీ షోలో పాడి ఎదిగాను. ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్‌ను చూస్తుంటే, నేను నన్ను గుర్తు చేసుకుంటున్నట్లే అనిపిస్తుంది. అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.”

తమన్ మాట్లాడుతూ.. “ఈ షోలో 6 వేల మంది కంటెస్టెంట్స్‌లోంచి 12 మందిని సెలెక్ట్ చేసాం. దీన్ని చూసి మీకు ఎక్కడైనా టాలెంట్ ఉంటే మీరు తెలుసుకుంటారు. మా కచేరీలకు వచ్చే ప్రేక్షకులు ఇప్పుడు ‘ఇండియన్ ఐడల్‌లో మీరు ఉన్నారు’ అని గుర్తిస్తున్నారు. ఈ షో మాకు కొత్త గుర్తింపును ఇచ్చింది. డల్లాస్, అమెరికా, ఆస్ట్రేలియా నుండి కూడా కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అందుకే ‘గల్లీ టు గ్లోబల్’ అని పెట్టాం.”

నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ.. “సీజన్ 3 విజయాన్ని చూసి సీజన్ 4కి పెట్టుబడి పెడదాం అనుకున్నాం. తమిళ ఇండియన్ ఐడల్‌లో ప్రతి సీజన్‌కు డబ్బు పెట్టాలి, కానీ తెలుగు ఇండియన్ ఐడల్‌కు ప్రేక్షకుల ప్రేమే పెద్ద బలం. స్కూల్ పిల్లలు కూడా వచ్చి పాడుతున్నారు. ఇతర రాష్ట్రాల పిల్లలు తెలుగు నేర్చుకుని పాడుతున్నారు. అమెరికా నుంచి కూడా కంటెస్టెంట్స్ ఈ షో కోసం వచ్చారు. మనం గల్లీ టు ఢిల్లీ అంటాం, కానీ ఇది గల్లీ టు గ్లోబల్ అయ్యింది.”

Updated Date - Sep 10 , 2025 | 06:51 PM