Allu Arjun: చిక్కడపల్లి పీఎస్‌కు వచ్చిన అల్లు అర్జున్
ABN , Publish Date - Jan 05 , 2025 | 11:31 AM
అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసులు (Ramgopalpet Police) నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన రాంగోపాల్‌పేట్ పోలీసులు బన్ని మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ నేపథ్యంలో ప్రతి ఆదివారం పీఎస్ ముందు హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆయన్ను ఆదేశించిన విషయం తెలిసిందే. బెయిల్ షరతుల దృష్ట్యా అల్లు అర్జున్ చిక్కడపల్లి పీఎస్‌కు వచ్చి సంతకం చేశారు. 10 నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసులు (Ramgopalpet Police) నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ (Sandhya Theater) తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావొద్దంటూ నోటీసులు అందించారు. హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన రాంగోపాల్‌పేట్ పోలీసులు బన్ని మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు. శాంతిభద్రతల దృష్ట్యా శ్రీతేజ్‌ను చూసేందురు రావొద్దని పేర్కొన్నారు. ఒకవేళ బాలుడిని పరామర్శించేందుకు రావాలనుకుంటే తమ సూచనలు పాటించాలని, ఏదైనా అనుకోని ఘటన జరిగితే అల్లు అర్జునే బాధ్యత వహించాలని తెలిపారు. శ్రీతేజ్‌ను పరామర్శిస్తారనే ప్రచారం జరగడంతో పోలీసులు నోటీసులు అందజేశారు.