Allu Arjun: సోమశిలలో అల్లు అర్జున్.. కృష్ణానదిలో బోటింగ్
ABN , Publish Date - Nov 09 , 2025 | 08:22 AM
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిలలో ఫ్యామిలీతో కలిసి కృష్ణానదిలో బోటింగ్ చేశారు.
సినిమా షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) శనివారం తన కుటుంబ సభ్యులు, చిన్ననాటి స్నేహితులతో కలిసి ఒక చిన్న వెకేషన్ ట్రిప్ కు వెళ్లారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామం దగ్గర కృష్ణానదిని సందర్శించి, ఆహ్లాదకరమైన వాతావరణంలో బోటింగ్ చేస్తూ 2 గంటలు అక్కడే గడిపారు.

సాయంత్రం త గంటల సమయానికి అక్కడకు చేరుకున్న అల్లు అర్జున్, టోపీ, మాస్క్ ధరించి ఎవరికీ గుర్తు కాకుండా రెండు గంటల పాటు నది తీరం వద్ద గడిపారు. సోమశిలలో “పుష్ప” ఉన్నాడని సోషల్ మీడియాలో తెలిసిన వెంటనే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నప్పటికీ, అప్పటికే ఆయన అక్కడి నుంచి బయలుదేరారు.

తర్వాత కొల్లాపూర్ మండలంలోని కుడికిళ్ల గ్రామానికి వెళ్లి, ప్రముఖ వ్యాపారవేత్త మైహోమ్ రామేశ్వరరావు నివాసంలో రాత్రి బస చేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ తిరిగి వెళ్లినట్లు సమాచారం.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న తన కొత్త చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నా, ఈ చిన్న బ్రేక్‌తో ఫ్యామిలీతో గడిపిన సమయం ఆయనకు పర్‌ఫెక్ట్ రిలాక్స్ మోమెంట్‌గా మారింది. సోమశిలలో అల్లు అర్జున్ సరదా బోటింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
