Boyapati Sreenu: అల్లు అర్జున్ – బోయపాటి సినిమా గేట్లు మూసుకున్నట్లే!
ABN , Publish Date - Dec 18 , 2025 | 08:37 PM
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌తో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే! ఈ విజయం తర్వాత గీతా ఆర్ట్స్ బోయపాటి శ్రీనుకు మరో సినిమా చేయాలంటూ అడ్వాన్స్ కూడా ఇచ్చింది.
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌తో(Allu Arjun) మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే! ఈ విజయం తర్వాత గీతా ఆర్ట్స్ బోయపాటి శ్రీనుకు మరో సినిమా చేయాలంటూ అడ్వాన్స్ కూడా ఇచ్చింది. ‘సరైనోడు’ సీక్వెల్ కోసం బోయపాటి శ్రీను కథను సిద్థం చేసి, మరోసారి అల్లు అర్జున్‌ను డైరెక్ట్ చేయాలని భావించారు బోయపాటి. అయితే పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ‘పుష్ప’ సూపర్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దక్షిణాది నుంచి టాప్ డైరెక్టర్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ టార్గెట్ అంతా పాన్ ఇండియా చిత్రాలపైనే ఉంది. దానిలో భాగంగా అట్లీతో ఓ సినిమా చేస్తున్నారు. ఇటు బోయపాటి కమిట్‌మెంట్ విషయానికి వస్తే అఖండ2 (Akhanda 2)చిత్రం అంచనాలకు తగ్గట్టు విజయం సాధిస్తే మరో మాస్ ఎంటర్‌టైనర్ చేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపించింది. ఇటీవల అల్లు అర్జున్ అమెరికాకు వెళ్లారు. వెళ్లే ముందు ‘అఖండ 2’ సినిమా చూసి, బోయపాటి శ్రీనును కలవాలనుకున్నారట. కానీ అఖండ2 టాక్ మిశ్రమంగా ఉండటంతో ఆ ప్లాన్ మార్చుకున్నారనీ, సినిమా చూడకుండా నేరుగా అమెరికాకు వెళ్లిపోయారని తెలిసింది. ఈ తంతు మొత్తం చూస్తే అల్లు అర్జున్, బోయపాటి శ్రీనుల కాంబోలో మరో సినిమా ఉండదనే అనిపిస్తుంది. బోయపాటికి అల్లు అర్జున్ ఆఫీస్ ద్వారాలు మూసుకున్నట్లే అన్నది సన్నిహిత వర్గాల మాట. దీని అంతటికీ కారణం అఖండ 2 తాండవం ఫలితమే!
అఖండ –2పై బోయపాటి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారని, పెద్ద కథ ఏమీ లేకుండా కేవలం బాలయ్య పాత్రను బేస్ చేసుకునే నడించిన తీరు సినిమా ఫలితాన్ని తారుమారు చేసిందని నెటిజన్ల కామెంట్స్ పెడుతున్నారు. హిట్లు ఎన్ని ఉన్నా ఒక్క సినిమా ఫలితం తారుమారు అయితే ఆ ప్రభావం తదుపరి చిత్రంపై పడుతుందన్నది అందరికీ తెలిసిందే! మరో పది రోజుల్లో బోయపాటి తదుపరి చిత్రం గురించి గుడ్ న్యూస్ చెబుతానన్నారు. ప్రస్తుతం సిచ్చుయేషన్ చూస్తే బన్నీతో సినిమా డ్రాప్ అయినట్లు ఉంది.
ఇదిలా ఉండగా, గీతా ఆర్ట్స్ సంస్థ బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అది ఇంకా చర్చల దశలోనే ఉంది. బాలయ్య మాత్రం ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఆ తర్వాత ‘ఆదిత్య 999’ సినిమాను లైనప్‌లో పెట్టుకున్నారు. ఇవన్నీ చూస్తే బోయపాటి శ్రీను తదుపరి చిత్రంపై ఓ స్పష్టత లేదు.