Allu Arjun: అల్లు అర్జున్ కోసం.. బెల్జియంలో మూసేసిన‌ రెస్టారెంట్‌ తెరిపించాం

ABN , Publish Date - Dec 29 , 2025 | 06:51 AM

సెలబ్రిటీలకు అత్యంత విలాసవంతమైన సేవలు అందించే ప్రముఖ లగ్జరీ కాన్సియర్జ్ సర్వీస్ సంస్థ సీఈవో కరణ్ భంగే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ అరుదైన సంఘటనను బయటపెట్టారు.

Allu Arjun

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలకు అత్యంత విలాసవంతమైన సేవలు అందించే ప్రముఖ లగ్జరీ కాన్సియర్జ్‌ సర్వీస్‌ సంస్థ సీఈవో కరణ్‌ భంగే (Karan Bhangay) అల్లు అర్జున్ (Allu Arjun)కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. బెల్జియం పర్యటనలో ఉన్నప్పుడు అల్లు అర్జున్‌, ఆయన మిత్రబృందం కోరిన ఓ కోరిక తనను ఎంతగానో ఆశ్చర్య పరిచిందని వెల్లడించారు.

అల్లు అర్జున్‌, ఆయన స్నేహితుల బృందం అక్కడి ఓ రెస్టారెంట్‌లో పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలనుకున్నారు. అన్‌ సీజన్‌ కావడంతో ఆ రెస్టారెంట్‌ మూతపడింది. అయితే అల్లు అర్జున్‌, ఆయన స్నేహితులు ఆ రెస్టారెంట్‌లోనే భోజనం చేయాలని పట్టుపట్టడంతో యజమానులతో మాట్లాడాం. కేవలం బన్నీ కోసం ఆ ఒక్క సాయంత్రం మొత్తం రెస్టారెంట్‌ను తెరిపించాం. దీనికోసం ఆ రెస్టారెంట్‌ ఒక వారాంతం మొత్తంలో సంపాదించే ఆదాయాన్ని (లక్షల్లో) చెల్లించారు.

ఆ రాత్రి రెస్టారెంట్‌ను తెరవడంతో పాటు వారికిష్టమైన భారతీయ ఆహారాన్ని, వారి అభిరుచికి తగ్గ సంగీతాన్ని ఏర్పాటు చేశారు. మొత్తానికి హైదరాబాద్‌ అనుభూతిని విదేశాల్లో అందించగలిగాం’ అని చెప్పారు. తమ కెరీర్‌లో ఎందరో హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్టార్లకు సేవలందించామనీ, కానీ అల్లు అర్జున్‌ బృందం కోరిక ప్రపంచంలోనే ఓ అత్యంత అరుదైన అనుభవంగా అనిపించిందని ఆయన వివరించారు.

హైదరాబాద్‌లో తనకున్న పరపతితో ఇలాంటి పనులు చేయడం అల్లు అర్జున్‌కు సులభం కావచ్చు కానీ బెల్జియం వంటి దేశంలో కూడా అదే స్థాయి సౌకర్యాన్ని, విలాసాన్ని కల్పించడం చూసి ఆయన ఆశ్చర్య పోయారని కరణ్‌ వివరించారు. ఇలాంటి సర్వీసుల కోసం అయ్యే ఖర్చు లక్షల్లో ఉంటుందని, అయితే ఆ స్థాయి వ్యక్తులకు డబ్బు కన్నా కూడా తమకు కావాల్సింది జరగడం ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 06:51 AM