Allu Arjun: వామ్మో.. రిలీజ్‌కు ముందే రూ.600 కోట్ల డీల్..
ABN , Publish Date - Dec 29 , 2025 | 08:01 PM
'పుష్ప 2 (Pushpa 2)'తో పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇమేజ్ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది.
Allu Arjun: 'పుష్ప 2 (Pushpa 2)'తో పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇమేజ్ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. ఈ క్రమంలో కోలీవుడ్ సంచలన దర్శకుడు అట్లీ (Atlee)తో కలిసి బన్నీ ఒక భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నారు. సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే దీనిపై భారీ హైప్ నెలకొంది. ఈ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా, ఈ సినిమా ఓటీటీ డీల్ గురించి ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బన్నీ-అట్లీ మూవీ డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ డీల్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 600 కోట్లు ఆఫర్ చేసినట్లు టాక్. భారతీయ సినీ చరిత్రలో ఒక సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఇదే తొలిసారి. అల్లు అర్జున్ మార్కెట్ స్టామినాకు ఈ డీల్ ఒక నిదర్శనమని చెప్పవచ్చు. అయితే, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
సుమారు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా హాలీవుడ్ టెక్నీషియన్లతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బన్నీ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. ఆమెతో పాటు రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి టాప్ హీరోయిన్లు కీలక పాత్రల్లో మెరవనున్నారట. ఇందులో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే, వీటిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2026 నాటికి చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.