Akkineni Sobhita: రాముయిజాన్ని ఫాలో అవుతున్న అక్కినేని కోడలు..
ABN , Publish Date - Dec 06 , 2025 | 08:17 PM
అక్కినేని కోడలు శోభితా (Akkineni Sobhita) ప్రస్తుతం ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క మంచి భార్య బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా మారింది.
Akkineni Sobhita: అక్కినేని కోడలు శోభితా (Akkineni Sobhita) ప్రస్తుతం ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క మంచి భార్య బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా మారింది. ఒకప్పుడు అమ్మడి పేరు అసలు తెలుగువారికి ఎవరికి తెలిసింది కూడా లేదు. ఎప్పుడైతే అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)తో డేటింగ్ రూమర్స్ గుప్పుమన్నాయో అప్పటినుంచి శోభితా స్టార్ గా మారింది. ఇక ఇప్పుడు అక్కినేని ఇంటి పెద్ద కోడలిగా గౌరవం అందుకుంటుంది. ఇక చైతో రిలేషన్ అని రూమర్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చాలామంది ఆమెను ట్రోల్ చేస్తూనే వస్తున్నా.. ఏ రోజు కూడా శోభితా వాటిపై స్పందించలేదు.
ఇక ఆ ట్రోల్స్ పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు లైఫ్ ని లీడ్ చేస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా శోభితా ఈ ఏడాదిలో విన్న టాప్ సాంగ్స్, పాడ్ క్యాస్ట్ లు ఏంటో చెప్పుకొచ్చింది. ఆ పాడ్ క్యాస్ట్ ల్లో రాముయిజం కూడా ఉండడంతో అందరి దృష్టి దానిపైనే పడింది. రాముయిజం.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సిద్ధాంతాలను, అభిప్రాయాలను ఎవరికీ నచ్చుతుందో.. నచ్చదో అనే భయం లేకుండా మాట్లాడిన షో. ఇది స్పాటిఫై అనే మ్యూజిక్ యాప్ లో పాడ్ క్యాస్ట్ గా రిలీజ్ అయ్యింది. ఆ పాడ్ క్యాస్ట్ నే శోభితా ఈ ఏడాదిలో ఎక్కువ సార్లు విన్నట్లు తెలుస్తోంది.
ప్రేమ, పెళ్లి, సెక్స్, ఇండస్ట్రీ, బంధాలు, సమాజం.. ఇలా ఒకటి అని కాదు. అన్ని విషయాల గురించి వర్మ అందులో రా అండ్ రస్టిక్ గా మాట్లాడాడు. అందుకే వర్మని ఎంతమంది అయితే తిడతారో.. అంతకు మించిన చాలామంది ఆయనను దేవుడిగా కొలుస్తారు. బతికితే వర్మలా బతకాలి అని చెప్పుకొస్తారు. ఆ మాటలకూ శోభితా కూడా ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఆయన మాటల్లో నిజాయితీ, సత్యం.. అన్ని మెస్మరైజ్ చేసి ఉండొచ్చు. ఇంకోపక్క వర్మనే.. శివ సినిమాకు డైరెక్టర్ కావడం వలన కూడా శోభితా ఈ ఏడాది నుంచి వర్మను ఫాలో అవుతూ ఉండొచ్చు. నిజం ఏంటి అనేది తెలియదు కానీ, అభిమానులు మాత్రం ఈ విషయం తెలియడంతో సూపర్.. రాముయిజం చాల బావుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.